టాలీవుడ్ స్టార్ దర్శకులలో క్రిష్ ఒకరు. అతను సినిమాలు కమర్షియల్‌గా విజయం సాధించనప్పటికి సినిమా చూస్తున్నంతసేపు సినిమాలో లీనం చేస్తాడు క్రిష్. తాజాగా అతను దర్శకత్వం వహించిన ఎన్టీఆర్ కథానాయకుడు కూడా ఇలాంటి ఫలితాన్నే చవిచూసింది. క్రిష్‌కు బాలీవుడ్‌లో కూడా మంచి పేరుంది. అతను దర్శకత్వం వహించి, మధ్యలోనే ఆపేసిన సినిమా మణికర్ణిక. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు క్రిష్. తరువాత ఆమెతో విభేదాలు రావడంతో సినిమా నుంచి తప్పుకున్నాడు క్రిష్.
అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు క్రిష్. సోనూ సూద్ పాత్రను మార్చమనడంతో కంగనాతో అభిప్రాయభేదాలు తలెత్తాయి. ఇంటర్వెల్‌కు ముందు సోనూ పాత్ర చనిపోవాలని ఆమె పట్టుబట్టింది. దానికి నేను ఒప్పుకోకపోవడంతో వాగ్వాదం జరిగింది. నిర్మాతలు కూడా ఆమెకే మద్దతుగా నిలిచారు. దీంతో నేను సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. నేను కొనసాగకపోతే తాను కూడా తప్పుకుంటానని నాతో చెప్పాడు సోనూ సూద్. కంగనా దర్శకత్వంలో నటించడానికి ఇష్టంలేక అతడు సినిమా నుంచి బయటకెళ్లిపోయాడని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదు. 100 నిమిషాలు ఉండాల్సిన అతడి పాత్రను 60 నిమిషాలకు కుదించారు. సినిమాకు నాకు రావాల్సిన పారితోషికం కూడా ఇవ్వలేదని తెలిపాడు క్రిష్.
- రావణుడిగా సీఎం విజయ్.. అమ్మవారిగా త్రిష..!
- సినీ నటుడు బాలకృష్ణకు గాయం..
- ‘టాక్సిక్’ నుంచి ‘మనసాగదే..’ సాంగ్ రిలీజ్!
- సరికొత్త వార్ యాక్షన్ డ్రామా ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’!
- ది ఒడిస్సీ.. తొలి వీకెండే రూ.2,548 కోట్ల వసూళ్లు!
- కొత్త తరహా థ్రిల్లర్ ‘న్యూటన్స్ థర్డ్ లా’!
