Sunday, May 4, 2025
- Advertisement -

మంత్రిగా ప్రమాణం చేసి లక్ష్మీ రతన్ శుక్లా

- Advertisement -

అతను ఇంత వరకూ మైదానంలో నిప్పులు చెరిగాడు. అటు బంతితోను, ఇటు బ్యాట్ తోనూ కూడా తన సత్తా చూపించాడు. పశ్చిమ బెంగాల్ రంజీ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు భారత్ తరఫున మూడు వన్డేలు కూడా ఆడిన లక్ష్మీ రతన్ శుక్లా ఇప్పుడు ప్రజా సేవకుడిగా మారాడు.

1999 సంవత్సరంలో భాతర తరఫున మూడు వన్డేలు ఆడిన శుక్లా గత రంజీ సీజన్ నుంచి క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ నూతన మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణం చేశాడు లక్ష్మీ రతన్ శుక్లా. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా త్రణమూల్ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచిన లక్ష్మీ రతన్ శుక్లాను ము‌ఖ్యమంత్రి మమతా బెనర్జీ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు.

క్రికెట్ మిగిల్చిన కొన్ని చేదు అనుభవాలను మరచిపోయి ఇక ప్రజాసేవపైనే తాను నిమగ్నమవుతానని ప్రమాణ స్వీకారం అనంతరం లక్ష్మీ రతన్ శుక్లా చెప్పాడు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -