Sunday, May 5, 2024
- Advertisement -

బెంగాల్ హా.. మజాకా.. బాంబులు హల్ చల్..!

- Advertisement -

బెంగాల్ లో మరోసారి భారీ స్థాయిలో బాంబులు బయటపడటం కలకలం రేపింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని భట్​పారా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో బాంబులు, బాంబు తయారీ పరికరాలు, గన్​పౌడర్​, బుల్లెట్​లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై పేలుడు పదార్థాలు, ఆయుధాల నియంత్రణ చట్టాల కింద కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

రాష్ట్రంలో ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పలు అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది.ప్రస్తుతం.. బాంబులు బయటపడిన నియోజకవర్గంలో ఈ నెల 22న పోలింగ్​(ఆరో దశ) జరగనుంది.బంగాల్​లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో.. గతంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఎన్నికలను పటిష్ఠమైన భద్రత నడుమ ఎనిమిది దశల్లో నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం.

వకీల్ సాబ్ ని తెగ మెచ్చుకున్న సూపర్ స్టార్!

పవన్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. అమెజాన్ ప్రైమ్‌లో ‘వకీల్‌ సాబ్‌’

ప్రైవేటు టీచర్లకు రూ. 2 వేలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -