క్రికెట్ చాలామంది ఆడుతుంటారు. కాని వారిలో చాలాకొద్ది మాత్రమే చిరస్థాయిలో నిలిచిపోతుంటారు. వారిలోమ సచిన్ మొదటి స్టానంలో ఉంటాడు. సచిన్ క్రికెట్‌కు విడ్కోలు పలికి చాలాకాలం అయినప్పటికి ,ఇప్పటికి సచిన్ గురించి నిత్యం మాట్లాడుకుంటారు. అలాంటి లిస్ట్‌లోకి వస్తాడు వెస్టిండిస్ డాషింగ్ బ్యాట్స్‌మెన్ క్రిస్‌గేల్. ఈ వెస్టిండిస్ స్టార్ క్రికెటర్ వన్డేలకు వీడ్కోలు పలికేందుకు రెడీ అవుతున్నాడు. వచ్చే ప్రపంచకప్ తరువాత గేల్ వన్డే క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
1999లో ప్రపంచ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు గేల్. తన 20 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా టి-20 క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు గేల్. 103 టెస్టుల్లో 7,215 పరుగులు, 284 వన్డేల్లో 9,727 పరుగులు, 56 టీ20లలో 1,607 పరుగులు చేశాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన ఏకైక విండీస్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. వెస్టిండీస్ బోర్డుతో విభేదించి కొంతకాలం జాతియ జట్టుకు దూరం కూడా అయ్యాడు. ఇదే సమయంలో వివిధ దేశాలలో జరిగే టి-20 లీగ్‌లలో ఆడుతు తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా ఐపీఎల్‌లో ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
- Advertisement -
వన్డే క్రికెట్‌కు స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ గుడ్‌బై…
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -