Saturday, April 27, 2024
- Advertisement -

కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్..తిరుగులేని భారత్

- Advertisement -

వన్డే ప్రపంచకప్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లో విజయం సాధించింది టీమిండియా. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది భారత్. బంగ్లాదేశ్ విధించిన 257 పరుగుల లక్ష్యాన్ని 41.3 ఓవర్లలో 3 వికెట్లు కొల్పోయి 261 పరుగులు చేసింది. లక్ష్యచేదనలో ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది భారత్. ముఖ్యంగా గిల్, రోహిత్ జోడి ఆది నుండే బంగ్లా బౌలర్లపై విరుచుకపడ్డారు. ముఖ్యంగా రోహిత్ అయితే సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వరద పారించాడు.

శుభ్‌మన్‌ గిల్‌ 2 సిక్స్‌లు, 5 ఫోర్లతో 53 పరుగులు చేయగా రోహిత్‌ శర్మ 2 సిక్స్‌లు,7 ఫోర్లతో 48 పరుగులు చేశాడు. ఇక తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కోహ్లీ 97 బంతుల్లో 4 సిక్స్‌లు, 6 ఫోర్లతో 103 నాటౌట్‌ నిలవగా కేఎల్‌ రాహుల్‌ (34) నాటౌట్‌ రాణించారు. బంగ్లా బౌలర్లలో మెహదీ 2 వికెట్లు పడగొట్టగా కోహ్లీకి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇక ఆదివారం న్యూజిలాండ్‌తో తలపడనుంది బారత్.

ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన రోహిత్ నాలుగు రికార్డులు నమోదు చేశాడు . అంతర్జాతీయ క్రికెట్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన కెప్టెన్‌గా 61 సిక్స్‌లతో రోహిత్ రికార్డు సృష్టించాడు. వన్డే ప్రపంచకప్‌లో లక్ష్యఛేదనల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌‌గానూ రోహిత్ రికార్డు క్రియేట్ చేశాడు. వన్డే మ్యాచ్‌లలో 6 వేల పరుగులు పూర్తిచేసుకున్న ఆటగాడిగా నిలవగా వన్డే ప్రపంచకప్‌లలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ నాలుగో స్థానానికి చేరాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -