ఈ భూమి.. ఆ భూమి ఒక్క‌రేనా.. ఎలా సాధ్య‌మైంది (వీడియో)

2015లో దమ్ లగా కే హైసా చిత్రంతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది భూమి పెడ్నేకర్. ఆ మూవీలో ఆమెను చూసిన వారేవ‌రైనా ఇండ‌స్ట్రీలో కొన్ని రోజులు మాత్ర‌మే ఉంటుంద‌నుకున్నారు. కార‌ణం యాక్టింగ్ అస్స‌లే కాదు.. బ‌రువు. స్క్రీన్ లుక్‌. మొదట 90 కిలోల బరువుతో చాలా లావుగా కనిపించిన ఈ నటి.. కొన్నాళ్లకు స్లిమ్‌గా తయారయి అందకి షాక్ ఇచ్చింది. 2017లో అక్షయ్‌కుమార్‌తో కలిసి నటించిన టాయ్‌లెట్..ఏక్ ప్రేమ్‌కథా చిత్రంలో ఎవరూ గుర్తుపట్టేలేనంత అందంగా మారింది భూమి. సుమారు 4 నెలలపాటు ఎంతో కష్టపడి వర్కవుట్స్ చేసి.. ఏకంగా 32 కిలోల బరువు తగ్గింది.

అంత షాట్ పిరియ‌డ్‌లో అంత‌లా బ‌రువు ఎలా త‌గ్గింది చెప్మా అంటూ అంద‌రూ ఆమెను ఫిట్‌నెస్ సీక్రెట్ అడ‌గటం మొద‌లు పెట్టార‌ట‌.

దీంతో ఫిట్‌గా మారేందుకు కావాల్సిన కొన్ని రకాల టిప్స్‌ను అందించింది భూమి. బయటి ఆహారపదార్థాలు కాకుండా కేవలం ఇంట్లో చేసిన వంటకాలనే తినడం. చెక్కరకు సాధ్యమైనంతవరకు దూరంగా ఉండటం. క్ర‌మం త‌ప్ప‌కుండా.. కొన్ని గోల్స్ పెట్టుకొని వాటికి త‌గ్గ‌కుండా చేయ‌డం… ఆకలితో ఉండకుండా చూసుకోవడం. 250 క్యాలరీల కంటే తక్కువ శక్తి ఉన్న పదార్థాలను క్రమం తప్పకుండా ప్రణాళిక బద్దంగా తీసుకుంటుండం వంటి టిప్స్‌ను సూచించింది భూమి. సింపుల్‌గానే అనిపిస్తుంది క‌దూ… కానీ చేసే వాళ్ల‌కు తెలుస్తోంది అదేంత క‌ష్ట‌మో. కానీ ఆ క‌ష్టాల‌ను దాటితేనే చూడ‌చ‌క్క‌ని రూపం సొంత‌మ‌వుతోంది… భూమి లాగా.

https://www.instagram.com/p/Bm2icsJFIq6/?utm_source=ig_web_button_share_sheet
https://www.instagram.com/p/BtXrraPA6PM/?utm_source=ig_web_button_share_sheet
https://www.instagram.com/p/BlvI1kfjwG2/?utm_source=ig_web_button_share_sheet