బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హిజ్రా పాత్ర నటించనున్నాడనే వార్త బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమిళ, తెలుగు భాషల్లో ఘనవిజయం సాధించిన కాంచన సినిమా. ఈ సినిమాలకు డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ నటించి, దర్శకత్వం వహించారు. ఈ సీక్వెల్‌లో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. తాజాగా ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ సినిమాకు లక్ష్మీ బాంబ్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. రాఘవ లారెన్సే ఈ సినిమాకు బాలీవుడ్‌లో దర్శకత్వం వహించనున్నాడు. ‘కాంచన’ సినిమాలో ప్రముఖ నటుడు శరత్ కుమార్ హిజ్రా పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే అబితాబ్ లాంటి స్టార్ హీరో హిజ్రా పాత్రలో కనిపించడానికి అంగీకరిస్తాడా అనేది అనుమానమే. దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఇలాంటి వార్తలు చాలానే వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్‌కు జోడిగా కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
- Advertisement -
‘హిజ్రా’గా నటించనున్న మెగాస్టార్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -