Saturday, April 27, 2024
- Advertisement -

రామ్ చరణ్‌తో అమితాబ్!

- Advertisement -

ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో #RC16 అనౌన్స్‌అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సగర్వ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై హై బడ్జెట్‌తో భారీ ఎత్తున నిర్మిస్తుండగా ఈ సినిమాతో గ్రాండ్‌గా చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నారు.

ఇక రామ్ చరణ్ సరసన ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా ఆస్కార్- విన్నింగ్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ కోసం పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ని సిద్దం చేశారు బుచ్చిబాబు.

తాజాగా ఈ సినిమా నుండి అదిరే అప్‌డేట్ వచ్చేసింది. ఓ స్పెషల్ రోల్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే యానిమల్ సినిమాతో విలన్ గా ఆకట్టుకున్న బాబీ డియోల్ ఈ సినిమాలో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక రామ్ చరణ్ లుక్ కోసం బుచ్చిబాబు తెగ కష్టపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -