Friday, May 3, 2024
- Advertisement -

అశ్వత్థామగా బిగ్ బి అమితాబ్..

- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ ఫాంటసీ చిత్రం తొలుత మే 9న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.

దీనిపై మేకర్స్ ఇంతవరకు స్పందించడం లేదు. ప్రభాస్ సరసన దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటిస్తుండగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని కీ రోల్ పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా అశ్వనీదత్ భారీ వ్యయంతో విజువల్ ట్రీట్‌గా ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

కల్కి సినిమాలో అమితాబ్ క్యారెక్టర్‌కి సంబంధించిన లుక్‌ని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అమితాబ్ అశ్వత్థామగా కనపడబోతున్నట్టు, ద్వాపర యుగం నుంచి విష్ణువు చివరి అవతారం కల్కి కోసం ఎదురుచూస్తున్నట్టు గ్లింప్స్ ద్వారా తెలిపారు. రూ. 400 కోట్ల భారీ బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -