Thursday, May 8, 2025
- Advertisement -

‘బిచ్చగాడు’ షాక్ చేస్తున్నాడు!

- Advertisement -

స్టార్ హీరో.. స్టార్ డైరెక్టర్.. స్టార్ హీరోయిన్.. వంటి వాటితో సంబంధం లేకుండా కేవలం అద్భుతమైన కథ ఉంటే చాలు ఓ సినిమా భారీ విజయం సొంతం సాధించడానికి. స్టార్ హీరో ఉండాల్సిన అవసరం లేదు కేవలం మంచి నటుడైతే చాలు, భారీ బడ్జెట్ అవసరం లేదు.

కేవలం సినిమా కథలో దమ్ము.. నటినటులను నుండి దర్శకుడు తనకు కావల్సిన నటనను రాబట్టే నైపుణ్యం ఉంటే చాలు సినిమా భారీ హిట్ అవుతుందని నిరూపించిన సినిమా ‘బిచ్చగాడు’. తమిళంలో తెరకెక్కి తెలుగులో అనువదాం అయిన ఈ చిత్రం ఇప్పుడు టాలీవుడ్ లో మంచి సినిమాగా కొనసాగుతోంది. సైలెంట్‌గా వచ్చి వైలెంట్ హిట్ కొట్టి  75 రోజులు కూడా దాటింది.

ఈ మధ్య కాలంలో ఏ సినిమా కూడా 75 రోజులు నడిచిన సందర్భాలే లేవు. ఒక వేళ నడిచిన కొన్ని థియేటర్లు మాత్రమే నడిచేవి. కానీ భిచ్చగాడు ఏకంగా 200 థియేటర్లలో 75 రోజులు పూర్తి చేసుకుంది. ఏ స్టార్‌కీ తీసిపోని రీతిలో సుమారు 200 థియేటర్లలో 75 రోజులు పూర్తి చేసుకుంది బిచ్చగాడు. ఈ మధ్య కాలంలో 50 రోజులే గొప్ప అనుకుంటే.. బిచ్చగాడు సినిమా ఏకంగా 100 రోజుల వైపు దూసుకెళుతోంది.

Related

  1. తగ్గే ప్రసక్తే లేదంటున్న బిచ్చగాడు
  2. బిచ్చగాడు టైటిల్ కి ఇబ్బందులు !
  3. “బిచ్చగాడు” వసూళ్లు 16కోట్లు..
  4. బిచ్చగాడు ఇప్పుడు కోటీశ్వరుడయ్యాడు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -