పోలీస్టేషన్ లో లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే రాపాకా..తీవ్రంగా స్పందించిన పవన్

పోలీస్టేషన్ పై దాడి కేసులో జనసేన ఎమ్మెల్యే రాపాకా రాజోలి పోటీస్టేషన్ లో లొంగిపోయాడు. రాజోలు నియోజకర్గం మలికిపురం పోలీస్‌ స్టేషన్‌పై దాడి కేసులో రాపాకతో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఆదివారం సాయంత్రం కలిగితి కుమార్‌ గెస్ట్‌హౌస్‌లో పేకాడుతున్న తొమ్మిది మందిని మలికిపురం ఎస్సై కేవీ రామారావు అదుపులోకి తీసుకోవడంపై రాపాక అభ్యంతరం వ్యక్తం చేశారు. తన అనుచరులతో కలసి పోలీస్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. అదే సమయంలో రాళ్లు రువ్వడంతో పోలీస్టేషన్ అద్దాలు పగిలిపోవడంతో రాపాకా, ఆయన అనుచరులపై కేసు నమోదయ్యింది. ఈ కేసులో ఏ1 ముద్దాయిగా రాపాక ఏ1గా ఉన్నారు.

దీంతో ఆయనను అరెస్ట్ చేయాలని పోలీసులు భావించారు. కాని ఆయనే మంగళవారం పోలీసులకు లొంగిపోయారు.ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు త్వరలో కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాన్ తీవ్రంగా స్పందించారు.

ప్రజల తరపున పోలీస్ స్టేషన్ కి వెళ్లిన ఎమ్మెల్యే రాపాకను అరెస్టు చేయడం కరెక్ట్ కాదని పవన్ అభిప్రాయపడ్డారు. నెల్లూరు లో వైసీపీ ఎమ్మెల్యే జర్నలిస్ట్ పై దాడికి ప్రయత్నిస్తే… ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటె తాను రాజోలు వచ్చి పోరాడతానని పవన్ ఈ సందర్భంగా హెచ్చరించారు.