Friday, April 19, 2024
- Advertisement -

జగన్ సర్కారు పై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు….ప్రభుత్వం కూలిపోతుందా…?

- Advertisement -

జగన్ సర్కార్ పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై అదరికి అనుమానాలు కలుగుతున్నాయి. జగన్ రెడ్డి సర్కారు ఆయుష్షు తొమ్మిది నెలలేనని ఆయన చెప్పారు.అంతేగాకుండా ఎమ్మెల్యేలను సంతృప్తిపరచకపోతే అందరూ ఎదురుతిరిగే ప్రమాదం వుందని తీవ్రంగా హెచ్చరించారు.

1972లో పివి నరసింహారావు ముఖ్యమంత్రి అయిన తొమ్మిది నెలలకే అందరూ కలిసి దింపేశారని ఉదాహరణగా చెప్పారు. అలాగే 1994లో మంచి మెజారిటితో గెలిచిన ఎన్టీయార్ ను కూడా టిడిపి మంత్రులు, ఎంఎల్ఏలు కలిసి దింపేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్టీయార్ పై చంద్రబాబునాయుడు తిరుగుబాటు చేస్తాడని ఎవరైనా అనుకున్నారా ? అంటూ ప్రశ్నించారు.

నరసింహారావును, ఎన్టీఆర్‌ను దించేసిన ఘటనలు ఎమ్మెల్యేలలో అసంతృప్తి వచ్చే జరిగిందని ఉండవల్లి చెప్పుకొచ్చారు. 151 మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చిన పార్టీకి అలాంటి పరిస్థితి రాకూడదని జగన్ మేలుకోవాలని హెచ్చరించారు.వైసిపిని అధికారంలోకి తేవటంలో ప్రధానంగా నవరత్నాలే కారణమన్నారు. తర్వాతే చంద్రబాబు అవినీతి ఎట్సెట్రా అంటూ కుండబద్దలు కొట్టారు.

నవరత్నలు అమలు చేయటంలో ఫెయిలైతే జనాలు తిరగబడతారు, ప్రాధాన్యత దక్కటం లేదని అనుకుంటే ఎంఎల్ఏలు కూడా తిరగబడతారని ఉండవల్లి చెప్పింది కరెక్టనే అనుకోవాలి. ఇక కరెంటు కోతలు లేకుండా చూసుకోవాలని లేకుంటే ప్రభుత్వంపై ప్రజలకు వ్యతిరేకత వస్తుందన్నారు.తానొక్కడే అవినీతికి దూరంగా ఉంటే సాధ్యం కాదని అందరూ దూరంగా ఉండేట్లు చేయగలిగితేనేజగన్ గొప్ప అంటూ వార్నింగ్ ఇచ్చారు. జగన్ తమకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఎంఎల్ఏలు గనుక ఫీలైతే పార్టీలో తిరుగుబాటు పెద్ద కష్టం కాదన్నారు.కాబట్టి ఎంఎల్ఏల విషయంలోజగన్ జాగ్రత్తగా ఉండాలన్న ఉండవల్లి హెచ్చరికను తేలిగ్గా తీసేసేందుకు లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -