Friday, April 19, 2024
- Advertisement -

గ్రామ,సచివాలయ ఉద్యోగులకు జగన్ కీలక సూచనలు…

- Advertisement -

ఏపీలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.గ్రామ, వార్డు సెక్రటేరియట్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ నేడు నియామక పత్రాలను అందజేస్తూ పలు కీలక సూచనలు చేశారు. గ్రామ పాలన వ్యవస్థ వెంటిలేటర్ పై ఉందని దానికి ప్రాణం పోయాల్సింది మీరేనన్నారు.కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా పనిచేయాలని చెప్పారు. గత ఎన్నికల్లో మన పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరూ… మళ్లీ వచ్చే ఎన్నికల్లో కూడా మన పార్టీకే ఓటు వేసేలా పని చేయాలని సూచించారు.

సచివాలయ వ్యవస్థలో 500లకు పైగా సేవలు ఉంటాయని, 34 శాఖలకు చెందిన పనులు జరుగుతాయని జగన్ అన్నారు. ప్రతి గ్రామ వాలంటీర్ కు స్మార్ట్ ఫోన్ అందజేస్తామని చెప్పారు. జనవరి 1 నుంచి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వస్తాయని… అదే రోజు నుంచే కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులను ఇస్తామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్క రికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని కోరారు.విజయవాడలోని ఏప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమానికి సీఎం జగన్‌ సహా మంత్రులు మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, తదితరులు హాజరయ్యారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -