Saturday, April 27, 2024
- Advertisement -

కరోనా బాధితులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యసేవలు అందించాలి : సీఎం జగన్

- Advertisement -

దేశం వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ప్రతిరోజు నాలుగు లక్షల వరకు కేసులు పెరిగిపోతున్నాయి. మూడు వేల వరకు మరణాలు సంబవిస్తున్నాయి. ఏపిలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కరోనా బీభత్సం మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవిడ్‌ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో కోవిడ్‌ పేషెంట్లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలన్నారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో కోవిడ్‌ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు ఇవ్వాలని, ఎంప్యానెల్‌ చేసిన ఆస్పత్రుల్లో విధిగా 50 శాతం బెడ్లు ఇవ్వాలని ఆదేశించారు. గురువారం క్యాంప్‌ కార్యాలయంలో కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్-ఎంప్యానెల్ ఆసుపత్రులకూ ఇదే వర్తిస్తుంది. ఆ మేరకు వెసులుబాటు కల్పించేలా నాన్-ఎంప్యానెల్ ఆసుపత్రులను తాత్కాలికంగా ఎంప్యానెల్ చేయాలంటూ ఆదేశించారు.

అన్ని ఆసుపత్రుల్లో కరోనా చికిత్స ఒకే విధంగా ఉండాలని.. 104కు వచ్చే కాల్స్ పై ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు వెంటనే స్పందించాలన్నారు. కొవిడ్ ఆసుపత్రుల్లో ఆహారం, పారిశుద్ధ్యం, వైద్యుల అందుబాటు, వైద్య సదుపాయాలు, ఆక్సిజన్… ఈ ఐదు అంశాలు ఎంతో కీలకంగా భావించాలి. ప్రతి బోధనాసుపత్రి వద్ద 10 కేఎల్ సామర్థ్యంతో ఆక్సిజన్ స్టోరేజీ ఉండాలి.

అదే సమయంలో ఇతర ఆసుపత్రుల వద్ద 1 కేఎల్ కెపాసిటీతో ఆక్సిజన్ స్టోరేజీ ఉండాలి. ముఖ్యంగా ఆక్సిజన్ సరఫరాలో ఎక్కడా లోపాలు ఉండరాదు. కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో ఆక్సిజన్ పొందడం, ఇతర మార్గాలపై అధికారులు కసరత్తులు చేయాలి. రోజుకు 500 టన్నుల ఆక్సిజన్ లభ్యతపై ఏంచేయాలో పరిశీలించండి. వైద్యులు లేకపోతే వెంటనే తాత్కాలికంగా అయినా నియామకాలు చేపట్టలన్నారు.

చిట్టి చిట్టి దోశలతో అర్హ ప్రత్యేక్షం.. బన్నీ ఎమోషనల్!

13ఏళ్ళ చిన్నవాడితో ప్రేమలో పడిన షకీలా.. పెళ్లి చేసుకోదట?

కరోనాను తన్నితరిమేశానంటున్న పూజా హెగ్డే.. వైరల్ కామెంట్స్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -