Tuesday, May 14, 2024
- Advertisement -

‘ఆర్ ఎక్స్ 100’ రెండు రోజుల క‌లెక్ష‌న్స్‌

- Advertisement -

‘ఆర్ ఎక్స్ 100’ సినిమా టైటిల్‌తోనే అంద‌రి దృష్టిని ఆక‌ట్టుకుంది.దర్శకుడు, హీరో, హీరోయిన్లు అంద‌రు కొత్తవాళ్లు అయిన‌ప్ప‌టికి సినిమాకు బాగానే ప్రమోష‌న్స్ వ‌చ్చింది.ఈ వార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.ఈ తరం కుర్రకారు కోరుకునే అంశాలతో అల్లిన కథ కావడంతో, వాళ్లకు ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది.. రెండు రాష్ట్రాల్లో రెండు రోజులకు గాను ఈ సినిమా 2.51 కోట్ల షేర్ ను వసూలు చేసింది.

శని , ఆదివారాల్లో ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. 3 కోట్ల బ‌డ్డెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా లాభాల ప‌ట్టాడం ఖాయంగా క‌నిపిస్తుంది.చిన్న సినిమాగా వ‌చ్చిన ఈ సినిమా పెద్ద హిట్ అవ‌డం ప‌ట్ల చిత్ర నిర్మాత‌లు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.రొమాంటిక్ లవ్ స్టోరీకి యాక్షన్ ను కలిపి దర్శకుడు అజయ్ భూపతి అందించిన తీరు కుర్రకారుకు బాగా నచ్చేసింది. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ అందాల ఆర‌బోత ఈ సినిమాకు పెద్ద ఎసెట్ అని అంద‌రు చ‌ర్చించ‌కుంటున్నారు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -