Friday, May 10, 2024
- Advertisement -

దూసుకుపోతున్న గ‌రుడ‌వేగ‌

- Advertisement -
  • యూఎస్‌లో లాభ‌ప‌డిన బ‌య‌ర్‌
  • రాజ‌శేఖ‌ర్‌కు న‌టుడిగా పున‌ర్జ‌న్మ‌

చాన్నాళ్ల త‌ర్వాత అపూర్వ విజ‌యం అందుకున్న రాజ‌శేఖ‌ర్‌కు గ‌రుడ‌వేగ పున‌ర్జ‌న్మ ఇచ్చిన‌ట్టు అయ్యింది. మ‌ధ్య‌లో కొన్ని సినిమాలు చేసినా ఫ‌లితం నిరాశ ఎదురైంది. అయితే పది రోజుల కిందట గరుడ‌వేగ చిత్రం విడుద‌ల‌య్యింది. ఆ చిత్రం ప్రేక్ష‌కుల‌కు విశేషంగా న‌చ్చేసింది. మంచి వ‌సూళ్లు వ‌స్తున్నాయి. చాలా మంచి టాక్ రావ‌డంతో ఆ సినిమా ఇంకా థియేట‌ర్ల‌లో నిర్విరామంగా ఆడుతోంది. మ‌ళ్లీ కొన్ని కొత్త థియేట‌ర్ల‌లో వేసుకోవ‌డానికి యాజ‌మాన్యాలు ఆస‌క్తి చూపుతున్నాయి. అయితే ఈ సినిమాకు ముందు ఉన్న రాజుగారి గ‌ది-2, రాజా ది గ్రేట్‌, ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ సినిమాల‌తో స‌మానంగా, ఓ ర‌కంగా వాటిని వెన‌క్కి నెట్టి ఈ సినిమా ఆడుతోంది. అయితే వ‌సూళ్లు నిరాశ‌గానే ఉన్నాయి.

రెండో వారాంతం ముగిసేసరికి కూడా ఆ చిత్రం రూ.6 కోట్లకు అటు ఇటుగా షేర్ వసూలు చేసిందంతే. రూ.25-30 కోట్ల మధ్య పెట్టుబడి పెట్టిన సినిమాకు మంచి టాక్ వచ్చి కూడా ఇంత తక్కువ వసూళ్లు రావడం నిరాశ కలిగించే విషయమే. అమెరికాలో మాత్రం ఈ సినిమా మంచిగా న‌డుస్తోంది. అక్కడి బయ్యర్ పెట్టిన పెట్టుబడి రూ.32 లక్షలు. ఐతే ఈ సినిమా ఇప్పటిదాకా 4.5 లక్షల డాలర్లు (దాదాపు రూ.3 కోట్లు) వసూలు చేసింది. అత‌డికి మంచి లాభాలు అందించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -