Monday, May 20, 2024
- Advertisement -

‘రంగస్థలం’ హిట్‌తో సుకుమార్‌పై క‌న్నేసిన అక్కినేని హీరో

- Advertisement -
ఎంత ప్ర‌య‌త్నాలు చేసినా.. ఎంత హైప్ తీసుకొచ్చినా త‌న చిన్న వార‌సుడికి అస‌లు క‌లిసి రావ‌డం లేద‌నే ఆందోళ‌న‌లో అక్కినేని నాగార్జున ఉన్నాడు. అఖిల్ తొలి సినిమా, రెండో సినిమాలు వ‌చ్చి వెళ్లాయి.. త‌ప్ప గుర్తు పెట్టుకునే అంత గొప్ప సినిమాలుగా నిల‌వ‌లేదు. అందుకే అఖిల్ మూడో సినిమాకు బాగా విరామం తీసుకొని చివ‌రికి ఒక‌టి ఎంపిక చేశారు.
‘తొలిప్రేమ’తో హిట్ కొట్టిన వెంకీ అట్లూరితో త‌ర్వాతి సినిమా ఒకే చేసి ప్రారంభించాడు. అయితే స్టార్ హీరోగా ఎద‌గాల‌నే ఆశ‌ అఖిల్ క‌న‌బ‌రుస్తున్నాడు. అందుకే పెద్ద పెద్ద ద‌ర్శ‌కుల‌తో సినిమా చేయాల‌నే ఆతృత క‌నిపిస్తోంది. అందుకే త‌ర‌చుగా పెద్ద ద‌ర్శ‌కుల‌ను పొగుడుతూ క‌నిపిస్తున్నాడు. ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన ‘రంగస్థలం’ సినిమా సూప‌ర్ హిట్ట‌య్యింది. ఈ సినిమాకు అఖిల్ శుభాకాంక్ష‌లు చెబుతూ చ‌ర‌ణ్‌తో క‌లిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు.
ఈ స‌మ‌యంలో త‌ను రాసిన వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి చూస్తే సుకుమార్‌తో సినిమా చేయాల‌నే ఆలోచ‌న‌లో అఖిల్ ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. మొద‌ట సుకుమార్ గురించి స్పందిస్తూ ‘వన్ ఆఫ్ మై డైరెక్టర్స్’ అని ట్వీట‌ర్‌లో పేర్కొన్నాడు. అఖిల్ సుకుమార్‌తో ఎప్పుడూ న‌టించాడు అని ప‌లువురు ప్ర‌శ్నించ‌డంతో అఖిల్ గ్ర‌హించి ‘వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్’ అంటూ త‌ప్పు స‌రిదిద్దుకొని ట్వీట్ చేశాడు.
ఈ లెక్క‌న అఖిల్ సుకుమార్‌తో సినిమా చేయాల‌నే ఆస‌క్తి తేట‌తెల్ల‌మ‌వుతోంది. మ‌రీ ఇంత ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్న అఖిల్‌కు సుకుమార్ అవ‌కాశం ఇస్తాడో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -