Wednesday, May 22, 2024
- Advertisement -

వివాదంలో చిక్కుకున్న చెన్నై సూపర్ కింగ్స్..

- Advertisement -

రెండేళ్ల నిషేదం తర్వాత పునరాగమనం చేస్తున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) జట్టుపై మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ లో భాగంగా రూపొందించిన గీతంతో చెన్నైకొత్త వివాదంలో చిక్కుకుంది. పాటలో… బట్టలు ఆరేసుకునే తీగ మీద నుంచి టెండూల్కర్ పేరుతో ఉన్న నంబర్ 10 జెర్సీ కిందపడిపోతుంది. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది.

ఎల్లో ఆర్మీ’ పాటలో ఆ జెర్సీని కింద పడేయడం ద్వారా సచిన్ ను అవమానించారంటూ ఆయన అభిమానులు మండిపడుతున్నారు. పాట నుంచి దీన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో రెండేళ్ల నిషేధం తర్వాత తిరిగి వచ్చిన చెన్నై జట్టుకు ఇది శరాఘాతంగా మారింది.

నంబర్ 10 జెర్సీని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వాడిన సంగతి తెలిసిందే. క్రికెట్ నుంచి సచిన్ రిటైర్ అయిన తర్వాత ఆయన గౌరవార్థం నంబర్ 10 జెర్సీకి కూడా బీసీసీఐ రిటైర్మెంట్ ప్రకటించింది. దీంతో, భారత్ లో ఎవరూ నంబర్ 10 జెర్సీని ధరించడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -