Saturday, April 20, 2024
- Advertisement -

మెగాస్టార్ రాజ‌కీయాల‌కు స్వ‌స్తి.. సినిమాల‌తో బిజీ

- Advertisement -

చిరంజీవి రాజ‌కీయ జీవితం ఇక చ‌రిత్రగా మిగిలే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఆయ‌న రాజ‌కీయ జీవితం నుంచి త‌ప్పుకున్న‌ట్టే క‌నిపిస్తోంది. 2009 ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యంతో దూకుడుగా వ‌చ్చి ఆ ఎన్నిక‌ల ఫ‌లితంతో నిరాశ‌కు గుర‌యిన చిరంజీవి ఆ త‌ర్వాత జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల‌తో కాంగ్రెస్ పార్టీలో విలీన‌మ‌య్యారు. ఆ త‌ర్వాత రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఎంపికై ఏకంగా కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా చిరంజీవి రెండు, మూడేళ్లు ప‌ని చేశారు. ఆ త‌ర్వాత 2009లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో యూపీఏ ప్ర‌భుత్వం కుప్ప‌కూలి అధికారానికి దూరంగా ఉన్నా చిరంజీవి మాత్రం ఆరేళ్ల రాజ్య‌స‌భ స‌భ్య‌త్వంలో కొన‌సాగారు.

అయితే మార్చి 28వ తేదీతో చిరంజీవి రాజ్య‌స‌భ స‌భ్యుడి ప‌ద‌వీ కాలం పూర్త‌య్యింది. దీంతో ఆయ‌న ఎంపీగా రిటైర‌య్యారు. దీంతోనే చిరంజీవి రాజ‌కీయాల నుంచి కూడా రిటైర‌య్యార‌ని తెలుస్తోంది. ఎందుకంటే ప్ర‌స్తుతం చిరంజీవి చేస్తున్న ప‌నులు చూస్తుంటే తెలుస్తోంది. ఎంపీగా ఉన్న స‌మ‌యంలోనే చిరంజీవి మ‌ళ్లీ సినిమాల‌కు రీ ఎంట్రీ ఇచ్చారు. ఖైదీ నంబ‌ర్ 150 సినిమాతో ఆక‌ట్టుకున్నాడు. ఇప్పుడు త‌ర్వాతి సినిమా సైరాను ప్రారంభించి ఆ సినిమా ప‌నుల‌తో బిజీగా ఉన్నాడు.

ప్ర‌స్తుతం 2019 ఎన్నిక‌లు స‌మీపిస్తున్నాయి. అయినా చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ఉండ‌డం లేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విభ‌జ‌న‌తో ఏపీలో కాంగ్రెస్ నామ‌రూపాల్లేకుండాపోయింది. ఈ స‌మ‌యంలో కాంగ్రెస్‌తో చిరు అంటిముట్ట‌కుండా ఉన్నారు. పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డం లేదు. ఇప్పుడు ఎంపీ ప‌ద‌వీ కాలం కూడా పూర్త‌వ‌డంతో ఇక రాజకీయాల భారం మోయ‌లేక సెల‌వు ప్ర‌క‌టించిన‌ట్టు తెలుస్తోంది. అనధికారికంగా రాజ‌కీయాల నుంచి చిరంజీవి త‌ప్పుకున్న‌ట్టు స‌మాచారం.

2019 ఎన్నిక‌ల స‌మ‌యం వ‌ర‌కు చిరంజీవి ఉంటాడా.. లేదా త‌న త‌మ్ముడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ కోసం రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్న‌ట్టు వినికిడి. ఏది ఏమైనా ఇన్నాళ్లు రాజ‌కీయాల‌తో దూర‌మైన అభిమానుల కోసం చిరంజీవి యూట‌ర్న్ తీసుకోవ‌డంపై అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ఏడాదిలో రెండు సినిమాల్లో చిరు క‌నిపించాల‌ని ఫ్యాన్స్ కోరుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -