Wednesday, May 8, 2024
- Advertisement -

రాంచ‌ర‌ణ్‌కు హిట్ ఇవ్వలేకపోయాన‌నే …

- Advertisement -

మెగ బ్ర‌ద‌ర్ నాగ‌బాబు సినిమాలు పెద్ద‌గా చేయ‌క‌పొయిన ప‌లు టీవీ షోల ద్వారా నిర్మాత‌గా త‌న‌కంటు ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చ‌కున్నారు.నాగ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో అల్లు అర్జున్ హీరోగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తీశారు. ఈ సినిమా మే 4న విడుద‌ల‌కు సిద్ధం అవుతుంది.సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతు సినిమా బాగా వ‌చ్చింద‌ని …సినిమాలో బ‌న్నీ ఆక‌లితో ఉన్న పులిలా క‌నిపిస్తాడ‌ని చెప్పుకొచ్చాడు.దీనిలో భాగంగా మీడియా అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పారు.

రాంచ‌ర‌ణ్‌కు మ‌గ‌ధీర లాంటి హిట్ త‌రువాత ఆరెంజ్ లాంటి పెద్ద ఫ్లాప్ ఇచ్చాన‌ని …సినిమా ఫ్లాప్ క‌న్నా చ‌ర‌ణ్‌కు హిట్ ఇవ్వ‌లేక‌పోయ‌న‌ని భాదే ఎక్కువుగా ఉంది అన్నారు నాగాబాబు.ఆ సినిమా ఇప్ప‌డు రీలిజ్ అయ్యి ఉంటే హిట్ సినిమా అని రాంగ్ టైమ్‌లో మంచి సినిమాని రీలిజ్ చేసి త‌ప్పు చేశామ‌ని చెప్పుకొచ్చారు. ఈ సినిమా ఫ్లాప్‌తో నాగాబాబు అప్పుల‌లో కురకుపోయ్యారన్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే. ఆ భాద‌లో నాగ‌బాబు ఆత్మ‌హ‌త్యకు ప్ర‌య‌త్నించిన సంగ‌తి కూడా తెలిసిందే. ఆరెంజ్ సినిమా త‌రువాత నాగ‌బాబు తీస్తున్న సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కావ‌డం విశేషం.మ‌రి ఈ సినిమా అయిన నాగ‌బాబుకు హిట్ ఇస్తుందేమో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -