Wednesday, May 1, 2024
- Advertisement -

రూమర్లుకు అలవాటు ప‌డిన నీహారిక

- Advertisement -

నీహారిక గురించి మ‌నం ప్ర‌త్యేకంగా చేప్పుకోవాల్సిన అవ‌స‌రం లేదు. మెగా డాట‌ర్‌గా ఇండ‌స్ట్రీకి ప‌రిచియ‌మైంది.తెలుగుతో పాటు త‌మిళ్ సినిమాలు కూడా చేస్తేంది. ఈ భామ మీద చాలానే గాసిప్స్ వ‌చ్చాయి.వాటి పై స్పందిస్తు గ్యాసిప్ లు ఇలా వుంటాయని, వస్తాయని సినిమారంగంలోకి రాకముందే తెలుసు అని, వాటికి సిద్దపడే నటిగా పయనం ప్రారంభించానని అంటోంది కొణిదెల నీహారిక. తన తమిళ సినిమాల ప్రమోషన్ టైమ్ లో నీహారికకు ఈతరహా ప్రశ్నలు ఎదురుకాక తప్పడం లేదు.

హీరో నాగశౌర్యతో పెళ్లి అనే రూమర్ గురించి ఎక్కువగా అడుగుతున్నారట. దానికి నీహారిక తనకు చాలా మంది కొలీగ్స్ మాదిరిగానే నాగశౌర్య కూడా జస్ట్ ఓ ఫ్రెండ్ అని బదులిస్తోంది. ఇంతకు ముందు ఎవరెవరో అన్నారు. ఆఖరికి తన కజిన్ ల పేర్లు ముడిపెట్టారు. ఇవన్నీ విని విని, అలవాటైపోయింది. మొదట్లో కాస్త బాధనిపించినా, ఏం చేయలేమని తెలిసాక అలవాటు చేసుకున్నా అంటోంది. ఇలాంటి వాటి వల్ల తన మైండ్ సెట్ మారిపోదని, తన కెరీర్ మారిపోదని, తనేంటో తనకు, తన ఫ్యామిలీకి తెలుసు అని అంటోంది నీహారిక.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -