Wednesday, May 22, 2024
- Advertisement -

ప్యాడ్‌మ్యాన్ రివ్యూ

- Advertisement -

బాలీవుడ్‌లో సందేశాత్మ‌క సినిమాలు తీయాలంటే అక్ష‌య్‌కుమారే. అత‌డి సినిమాలు సామాజిక అంశాలు, స‌మ‌స్య‌ల‌పై ఉంటాయి. అలా సినిమాలు చ‌క‌చ‌కా చేసుకుంటూ వెళ్తుంటాడు. గ‌తంలో టాయిలెట్ సినిమాతో వ‌చ్చి విజ‌యం అందుకున్నాడు. ఇప్పుడు మ‌రో సందేశాత్మ‌క సినిమాతో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాడు. మ‌హిళ‌ల ప్ర‌ధాన స‌మ‌స్యపై ఓ వ్య‌క్తి చేసిన పోరాటం గురించి ‘ప్యాడ్‌మ్యాన్‌’ సినిమాతో వ‌చ్చాడు. భార‌త‌దేశానికి ప్యాడ్‌మ్యాన్ ఉన్నాడ‌ని చెబుతూ వ‌చ్చాడు.. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..

కథే ఏమిటంటే..: లక్ష్మీకాంత్‌ చౌహాన్ (అక్షయ్‌కుమార్‌), గాయత్రి (రాధికా) భార్య‌భ‌ర్త‌లు. వీరిద్ద‌రూ మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ గ్రామంలో ఉంటారు. ఇద్దరి దాంప‌త్య జీవితం స‌వ్యంగా జ‌రుగుతుంటుంది. ఈ స‌మ‌యంలో భార్య రుతుక్రమం కారణంగా ఒక్కోసారి బయటికు రాలేని ప‌రిస్థితి. ఇంటికే ప‌రిమిత‌మ‌వుతుంది. మురికి బ‌ట్ట‌ల‌తో శుభ్రం చేసుకుంటుండ‌గా లక్ష్మీకాంత్ చూసి ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తాడు. ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని, శానిటరీ న్యాప్‌కిన్లు వాడమని చెప్తాడు. అవి వాడ‌లంటే రేటు ఎక్కువ వాడ‌లేను అంటుంది. వెంట‌నే ఆలోచ‌న‌లో ప‌డ‌తాడు. త‌క్కువ ధ‌ర‌కు వాటిని త‌యారు చేయాల‌ని నిర్ణయించుకుంటాడు. ఈ విష‌యం తెలుసుకున్న వార‌అందరూ అతడిని ‘మ్యాడ్‌మ్యాన్‌’ అని న‌వ్వుల‌పాలు చేస్తారు. అయినా విన‌కుండా తాను అనుకున్న‌ది చేస్తాడు.. ఆ త‌ర్వాత వ్యాపారంలో రాణించి మ‌హిళ‌ల స‌మ‌స్య‌ల‌కు ఎలా ప‌రిష్కారం చూపాడు? ‘మ్యాడ్‌మ్యాన్‌’.. ‘ప్యాడ్‌మ్యాన్‌’ ఎలా అయ్యాడు? సోనమ్‌కపూర్ పాత్ర ఏమిటి? సినిమా చూడండి.

ఎలా ఉందంటే..: చెన్నైకి చెందిన అరుణాచలం మురుగనాథమ్‌ జీవిత క‌థ‌పై ఈ సినిమా తీశాడు. దర్శకుడు బాల్కీ ఈ క‌థ‌ను చ‌క్క‌గా తీశాడు. తొలిభాగం అక్షయ్‌, రాధిక ప్రేమాయ‌ణంతో పూర్తిచేశాడు. రుతుక్రమంతో ఆడవాళ్లు ప‌డే బాధ‌లు, క‌ష్టాలు తెర‌పై చూపించారు. ఆ త‌ర్వాత సెకండాఫ్‌ ఆ న్యాప్‌కిన్ల తయారీ చేయ‌డం.. అత‌డు ఎదుర్కున్న క‌ష్టాలతో సినిమా పూర్తి చేశాడు. సినిమా అస‌లు క‌థ చాలాసేప‌టికి తీసుకొచ్చాడు.

ఎవరు ఎలా న‌టించారంటే..: అక్షయ్‌కుమార్ సాధారణ వ్యక్తి పాత్ర‌లో క‌నిపించాడు. శానిటరీ న్యాప్‌కిన్‌ పట్టుకున్నప్పుడు హాస్యం పండించారు. రాధికా తన పాత్ర మేర‌కు న‌టించింది. సోనమ్‌కపూర్ చిన్న పాత్ర‌లో మెరిసినా కీల‌క పాత్ర అది. మిగ‌తా నటీనటులు త‌మ ప‌రిధి మేర‌కు న‌టించారు. రుతుక్ర‌మం గురించి ద‌ర్శ‌కుడు బాల్కీ బాగా ప‌రిశీలించి తీశాడు. మ‌రో సందేశాత్మ‌క చిత్రంగా అక్ష‌య్‌కుమార్ వ‌చ్చి విజ‌యం కొట్టాడు. కొద్దిగా స్లో అనిపించినా అంద‌రూ చూడాల్సిన సినిమా. ఆడ‌వారి స‌మ‌స్య‌పై అర్థం చేసుకోవాల్సిన సినిమా.

నటీనటులు: అక్షయ్‌కుమార్‌, రాధికా ఆప్టే, సోనమ్‌కపూర్‌ తదితరులు
దర్శకత్వం: ఆర్‌.బాల్కీ
సంగీతం: అమిత్‌ త్రివేది
నిర్మాతలు: ట్వింకిల్‌ ఖన్నా, అనిల్‌ నాయుడు

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -