Friday, April 26, 2024
- Advertisement -

వీకిపీడియాలో బాహుబ‌లి రికార్డు

- Advertisement -

ఒక్క సినిమాతో తెలుగు సినీ స‌త్తా ప్ర‌పంచానికి తెలిసి వ‌చ్చింది. ఏమేమి రికార్డులు ఉన్నాయో ఆ రికార్డుల‌న్నింటిని బాహుబ‌లి క‌న్‌క్లూజ‌న్ సినిమా కాల రాసింది. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోనే కాక భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌లోనే చెర‌గ‌ని ముద్ర వేసింది. కొత్త చ‌రిత్ర సృష్టించింది. క‌లెక్ష‌న్ల సునామి వ‌చ్చింది. దాదాపు రూ.1,700 కోట్ల వసూళ్లు ఈ సినిమాకు వ‌చ్చాయి.

ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్‌, అనుష్క‌, రానా, ర‌మ్య‌కృష్ణ, స‌త్య‌రాజ్‌, నాజ‌ర్‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందించిన ఈ సినిమా 2017 సంవ‌త్స‌రంలో చెర‌గ‌ని ముద్ర వేసింది. ఈ సినిమా ఇప్పుడు మ‌రో అరుదైన రికార్డు త‌న ఖాతాల్లో వేసుకుంది. తెలుగు సినిమా వికిపీడియాలో తొలిసారిగా మంచి స్థానంలో నిల‌బడింది.

ఇంగ్లీషు వికిపీడియాలో ఈ సినిమా గురించి అత్యధిక మంది చదివారని వికిమీడియా ప్రకటించింది. 2017లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వికీపీడియాలో చదివిన 25 ఆర్టికల్స్‌ జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో 11వ స్థానంలో మ‌న సినిమా ఉంది. 1.46 కోట్ల వ్యూస్‌తో ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ పదకొండో స్థానాన్ని సొంతం చేసుకుంది. ఓ తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనతను సాధించడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -