సంక్రాంతి బరిలోకి వస్తున్న సినిమాల్లో పవన్‌కల్యాణ్ సినిమా ఆసక్తి రేపుతోంది. అయితే ఆ సినిమా విజయవంతమవుతుందా.. ఎలా ఉంటుంది అని కాదు. ఆ సినిమా విడుదల అవుతుందా? లేదా అని ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. ఎందుకంటే ఈ సినిమాకు కాపీ రైట్ వివాదం రేగుతోంది. ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ”లార్గో వించ్” సూపర్‌హిట్ అయ్యింది.
పవన్‌కల్యాణ్ సినిమా ‘అజ్ఞాతవాసి’ సినిమాను తమ సినిమా కథను కాపీ చేశారని ఓ ఫ్రెంచ్ దర్శకుడు ఆరోపణలు చేశాడు. అనుమతి లేకుండానే సినిమా తీస్తున్నారని.. ఇందుకు సంబంధించి కాపీరైట్ యాక్ట్ కింద టీ-సిరీస్ సంస్థ నోటీసులు పంపారని సమాచారం. ఆ కథనే అజ్ఞాతవాసిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగులో తీస్తున్నారని లార్గోవించ్ దర్శకుడు జెరోమి సల్లే ట్వీట్ చేశాడు. ఆ సినిమాను బాలీవుడ్‌లో తీద్దామని ఆ సినిమా నిర్మాణ హక్కులు ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ పొందింది. ఈ సంస్థ నిర్మాత, దర్శకులకు లీగల్ నోటీసులు అందించినట్లు సమాచారం.
టీ సిరీస్ సంస్థ అజ్ఞాతవాసి మీద వస్తున్న ఆరోపణలకు లీగల్‌గా అడుగులు వేస్తోంది. అయితే టీ సిరిస్ సంస్థతో పరిచయాలు ఉన్న దగ్గబాటి రానా రాయబారిగా నిలచాడంట. టీ సిరిస్ సంస్థతో ఓ డీల్ కుదిరిందని సమాచారం. టీ సిరీస్ సంస్థతో పరిచయాలున్ననటుడు రానాని అజ్ఞాతవాసి నిర్మాత రంగంలో దింపినట్లు సమాచారం. సమస్యను తెర వెనక నుండి పరిష్కరించుకునేలా అడుగు వేశారంట. ఈ సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఓ ఆఫర్‌ను ఆ నిర్మాత సంస్థకు ఇచ్చాడట రూ.10 కోట్లు ఇస్తాం.. ఏమీ మాట్లాడవద్దని రచ్చ చేయొద్దని చెప్పారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు సినిమా కాపీయో కాదో విడుదలైతేగానీ తెలియదు. కానీ ఆ సంస్థతో డీల్ కుదరడం చూస్తుంటే ఈ సినిమాను ఆ సినిమా కాపీ తీసుకుని ఉంటారనే పుకార్లు వాస్తవాలయ్యే అవకాశం ఉంది.
