Monday, May 20, 2024
- Advertisement -

‘వెన్నుపోటు’ నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్

- Advertisement -

వివాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ , ఎప్పుడు వివాదాల‌తోనే సావాసం చేస్తుంటాడు. సినిమాల‌ను ఎలా ప‌బ్లిసిటీ చేసుకోవాలో రామ్ గోపాల్ వ‌ర్మ‌కు తెలిసినంత‌గా మ‌రింత ఎవరికి తెలియ‌దు. వ‌ర్మ తాజాగా తెర‌కెక్కిస్తున్న చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్ రెండో భార్య ల‌క్ష్మీ పార్వ‌తి ఆయ‌న జీవితంలోకి వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి ఎన్టీఆర్ జీవితంలో చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్ర‌బాబును టార్గెట్ చేసుకుని ఈ సినిమాను తీస్తున్నాడు వ‌ర్మ. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన వెన్నుపోటు సాంగ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. తాను తీయ‌బోయేదే అస‌లైన ఎన్టీఆర్ జీవిత క‌థ అని గ‌ట్టిగా చెబుతున్నాడు వ‌ర్మ‌.

ఎన్టీఆర్ వ‌ర్థంతి సంద‌ర్భంగా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌లోని ఎన్టీఆర్ లుక్‌ను ప్రేక్ష‌కుల‌కు పరిచియం చేశాడు వ‌ర్మ‌. తాజాగా రామ్ గోపాల్ వ‌ర్మ ప్రేక్ష‌కుల‌కు మ‌రో షాక్ ఇచ్చాడు. బాహుబ‌లి సినిమాలోని క‌ట్ట‌ప్ప బాహుబ‌లి వెన్నుపోటు పొడిచి చంపే సీన్‌లో చంద్ర‌బాబు, ఎన్టీఆర్‌ల‌ను పెట్టి ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశాడు. ఈ ఫోటోను తన ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తు.. “ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తులు నాకు సరిగా గుర్తు రావటం లేదు.. . వారెవరో గుర్తుచేసుకోవడంలో నాకు సహాయం చేయగలరా?” అంటూ ప్రశ్నించాడు. ఫోటోలో క్యాప్షన్ “నెవర్ బెఫోర్.. నెవర్ ఆఫ్టర్”.. కింద సినిమా టైటిల్ లా ‘వెన్నుపోటు’ అంటూ క్యాపిటల్ లెటర్స్ లో ఉంది. వెన్నుపోటు సాంగ్‌పైనే ఫైర్ అయిన టీడీపీ వ‌ర్గం , మ‌రి ఈ పోస్ట‌ర్‌పై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -