Wednesday, May 15, 2024
- Advertisement -

సిల్క్‌స్మిత అయిపోయింది.. ఇప్పుడ శ‌కీలాది..

- Advertisement -

ష‌కీలా బ‌యోపిక్ సినిమాగా.. త్వ‌ర‌లో

రాజ‌కీయ నాయ‌కులు.. హీరోయిన్లు.. ఆట‌గాళ్లు.. ప‌లువురు ప్ర‌ముఖుల జీవిత చ‌రిత్ర‌లు అయిపోయాయి.. ఇప్పుడు హాట్ భామ‌ల బ‌యోపిక్‌ల‌పై ఇండ‌స్ట్రీ ఫోక‌స్ పెట్టింది. గ‌తంలో సిల్క్‌స్మిత బ‌యోపిక్ విడుద‌లై అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. ఇప్పుడు ఆ వ‌రుస‌లో ష‌కీలా జీవిత చ‌రిత్ర‌పై సినిమా రూపుదిద్దుకుంటోంది.

బాలీవుడ్‌లో బయోపిక్‌ హవా బాగానే నడుస్తోంది. హీరోయిన్ రిచా చద్దా కూడా ఒకరి బయోపిక్ లో నటించబోతోంది. ఈ బయోపిక్ అన్నిటికంటే కాస్త విరుద్ధం ఎందుకంటే ఈ సినిమా బేస్ అవ్వబోయేది ఒక మాములు సెలబ్రిటీ మీద కాదు ఒక పోర్న్ స్టార్ జీవితం మీద.

సిల్క్‌స్మిత వార‌సురాలిగా ఇండ‌స్ట్రీలో ఉన్న హాట్ న‌టి శ‌కీలా. తెలుగు, తమిళ్, మలయాళం సినీ ప‌రిశ్ర‌మ‌ల్లో శ‌కీలా సాఫ్ట్ పోర్న్ స్టార్‌గా శ‌కీలా పేరు పొందింది. ఆమె ఆ మ‌ధ్య వ‌రుస సినిమాలు చేస్తూ బి-గ్రేడ్ సినిమా కలెక్షన్లతో దూసుకెళ్లింది. సినిమాల్లో ఆమె ఉంటే హిట్టే అన్న‌ట్టు మారింది. 16 ఏళ్ల వయసులోనే పోర్న్ స్టార్‌గా మారి ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌లోసౌ వందల సినిమాల్లో నటించిన శ‌కీలా జీవిత చ‌రిత్ర‌పై ఇప్పుడు సినిమా తీయ‌నున్నారు. ఈ మధ్యనే తెలుగులో ఆమెతో `శీలవతి` అనే సినిమా కూడా తెరకెక్కింది.

కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వం సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమా శ‌కీలా పాత్ర‌లో రిచా అనే బాలీవుడ్ హీరోయిన్ న‌టించ‌నుంద‌ని స‌మాచారం. శ‌కీలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎలా స్టార్ అయ్యిందో ప్రేక్షకులకు ఈ సినిమా తెలియచేస్తుంది. రిచా చద్దాకు ఈ కథ చెప్పగానే ఆ రోల్ ఎంత పవర్‌ఫుల్ పాత్ర‌ అర్థమయ్యి వెంటనే ఓకే చెప్పేసిందంట. శ‌కీలా లైఫ్‌లో ఫ్యాన్స్‌కి చెప్పదగిన బోలెడన్ని ఆసక్తికరమైన కథలు ఉన్నాయి అంటున్నారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు టాక్.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -