Saturday, May 18, 2024
- Advertisement -

వైసీపీ త‌రుపున రాజ్య‌స‌భ‌కు నామినేష‌న్ వేసిన వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి…

- Advertisement -

వైసిపి తరపున రాజ్యసభ అభ్యర్ధిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేశారు. బుధవారం ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో అమరావతిలోని అసెంబ్లీ కార్యదర్శికి వేమిరెడ్డి తన నామినేషన్ పత్రాలను అందచేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డిని రాజ్యసభ అభ్యర్ధిగా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.

44 మంది ఎంఎల్ఏల బలమున్న వైసిపికి ఒక రాజ్యసభ స్ధానం దక్కుతుంది. ఎవరి బలాల ప్రకారం వాళ్ళు పోటీ చేస్తే వైసిపి తరపున వేమిరెడ్డి గెలవటం ఖాయం. వచ్చే నెలలో మూడు స్ధానాలు భర్తీ చేయాలి. అందులో రెండు టిడిపికి ఒకటి వైసిపికి దక్కుతాయి. అందులో భాగంగానే వేమిరెడ్డి ఈరోజు మూడు సెట్ల నామినేఫన్లను దాఖలు చేశారు. కార్యక్రమంలో చంద్రగిరి ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సామినేష‌ణ్ అనంత‌రం మాట్లాడిన వేమిరెడ్డి ప్ర‌భార్‌రెడ్డి ..దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి తాను అభిమానిని అని, వైఎస్‌ఆర్‌ పాలన చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాకు అత్యంత గౌరవాన్ని ఇచ్చారు. 40 ఏళ్లుగా వైఎస్‌ఆర్‌ కుటుంబంతో నాకు అనుబంధం ఉంది. రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ సీపీ కచ్చితంగా గెలుస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు

ఏ పార్టీ వాళ్లు అయినా వైఎస్‌ జగన్‌ చేస్తున్న ప్రజాసంకల్పయాత్రను చూస్తే ఆయన ఎంత గొప్ప నాయకుడో తెలుస్తుంద‌న్నారు . దురదృష్టవశాత్తు వైఎస్‌ఆర్‌ చనిపోయారు. కానీ ఈ రాష్ట్రానికి మంచి నాయకుడిని అందించారు. ఎన్నికష్టాలు ఎదురైనా జగన్‌ ప్రజల కోసం ధృడంగా నిలబడ్డారు. 2019లో వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవుతారు.’ అని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -