Sunday, May 12, 2024
- Advertisement -

స‌న్నీలియోన్ సినిమా ప్రారంభం

- Advertisement -

స‌న్నీలియోన్ సినిమా ప్రారంభం

ఒక‌ప్ప‌టి ప‌డ‌క గ‌ది తార, శృంగారంలో కూడా భిన్న‌మైన యాంగిల్స్ చేస్తూ.. కుర్ర‌కారుతోపాటు పురుషులను ఊపిరాడ‌కుండా చేసిన తార స‌న్నీ లియోన్‌. ప్ర‌స్తుతం అలాంటి సినిమాలు మానేసిన ఆమె ఇప్పుడు సినిమాల్లో మెరుస్తున్నారు. సినిమాల్లో ప్ర‌త్యేక పాత్ర‌ల్లో మెరుస్తున్న ఈ భామ‌కు ఓ మంచి సినిమా అవ‌కాశం వచ్చింది. నీలి చిత్రాల నుంచి వచ్చిన స‌న్నీ ప్ర‌త్యేక గీతాల్లో న‌టించింది. ఇప్పుడు న‌ట‌న‌ప‌ర‌మైన పాత్ర‌ల్లో సన్నీ క‌నిపిస్తున్నారు. ఇప్పుడు ప్ర‌స్తుతం త‌న ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఓ సోసియో ఫాంట‌సీ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

ఆఫర్స్ చాలా వస్తున్నప్పటికీ నట‌న‌కు ప్రాధాన్యం ఉన్న పాత్ర‌ల‌నే ఒప్పుకుంటోంది. ఇప్పుడు ఒక చారిత్రాత్మ‌క సినిమాలో న‌టిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో ‘వీర మహాదేవి’ అనే ఆ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ఇటీవ‌ల చెన్నైలో ప్రారంభ‌మైంది. దర్శకుడు విసి.వడి ఉడైయాన్ రూపొందిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేయ‌నున్నారు. భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను తీస్తున్నారు.

ఇక నుంచి రెగ్యులర్ షూటింగ్‌ని కొనసాగించనున్నట్లు నిర్మాత స్టీపెన్ తెలిపాడు. సన్నీ ఈ సినిమా షూటింగ్ కోసం 150 రోజుల డేట్స్ ఇచ్చేసింది. వర్క్‌షాప్‌లో సన్నీ హార్స్ రైడింగ్ కత్తి యుద్ధాలు అలాగే ఇతర యాక్షన్ సీక్వెన్స్‌ను నేర్చుకుంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి వ‌చ్చే సంవ‌త్స‌రం విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. రూ.150 కోట్ల‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. స్టీవ్స్ కార్న‌ర్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది.

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -