Thursday, May 16, 2024
- Advertisement -

కొండచిలువ, నాగుపాము బిగ్ ఫైట్ లో ఎవరు గెలిచారంటే…?

- Advertisement -

కొండ చిలువ ఎంత పెద్ద‌గా ఉంటుందో తెలుసు క‌దా. దాన్ని చూస్తేనే మ‌న‌కు వ‌ణుకు పుడుతుంది. ఇక కొండ చిలువ కంటే బలం తక్కువగా ఉన్నా నాగు పాము విషానికి పవర్ ఎక్కువ. ఇది క‌రిచిందంటే క్ష‌ణాల్లో ప్రాణాలు పోతాయి. అలాంటిది ఈ రెండిటి మధ్య హోరా హోరి పోరు జరిగితే ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టమే. అయితే ఇటీవలే కొండ చిలువకు నాగుపాముకు మధ్య జరిగిన భీకర పోరులో రెండు సర్పాలు మత్యుఒడికి చేరాయి. కొండ చిలువ, నాగుపాము కొట్లాటకు సంబంధించి ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ ఫైట్ ఎక్కడ జరిగిందన్నది సరిగ్గా తెలియనప్పటికీ, ఆసియాలోనే జరిగి ఉంటుందని నిపుణుల అంచనా. కాగా, దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఆగ్నేయాసియాలో చోటు చేసుకొని ఉండొచ్చని ఫ్లోరిడా మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీకి చెందిన కోలెమన్ షీహీ, నేషనల్ జియోగ్రఫీకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -