Friday, May 3, 2024
- Advertisement -

రాష్ట్ర బంద్ః జగన్ నిజాయితీ ఇది… బాబు, పవన్‌లు కూడా చిత్తశుద్ధిని నిరూపించుకోగలరా?

- Advertisement -

సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ చంద్రబాబు తీరు ఇదే. ఇప్పుడు రాష్ట్ర బంద్ సందర్భంగా కూడా అదే వ్యవహారశైలి. బంద్‌లో పాల్గొనడంతో పాటు వైకాపా శ్రేణులను, ప్రజలను ముందుండి నడిపిస్తున్నాడు వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ నాయకులు అందరికంటే ముందుగా బంద్‌లో పాల్గొన్నాడు జగన్. బంద్ విజయవంతం అవ్వాలని తన పాదయాత్రకు కూడా విరామం ఇచ్చాడు. బంద్‌లో పాల్గొనడంతో పాటు రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయంపై కేంద్రాన్ని నిలదీశాడు, చంద్రబాబు చేతకానితనాన్ని ఎత్తిపొడిచాడు. కానీ చంద్రబాబు మాత్రం జగన్‌కి దురుద్దేశాలు ఆపాదించడంపైనే శ్రద్ధ చూపుతున్నాడు. సమైక్యాంధ్ర కోసం జగన్ నిరాహారదీక్ష చేసిన నాడు కూడా బాబు తీరు ఇదే. సమైక్యాంధ్ర కోసం బాబు చేసింది ఏమీ లేదు. కానీ సమైక్యాంధ్ర కోసం నిరాహారదీక్ష చేసిన జగన్‌కి మైలేజ్ రాకుండా సోనియాతో కుమ్మక్కయ్యాడని దుష్ప్రచారం చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యారు.

ఇప్పుడు నాలుగేళ్ళుగా జరుగుతున్న అన్యాయంపై వామపక్ష పార్టీలు బంద్‌కి పిలుపు ఇచ్చాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ బంద్‌కి సంపూర్ణ మద్ధతు ఇచ్చాడు జగన్. వామపక్షాలు నరేంద్రమోడీ, బిజెపిలకు బద్ధ శతృవులన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ జగన్ మాత్రం మోడీకి బెదరకుండా వామపక్షాల బంద్‌కి మద్ధతిచ్చాడు. ఆ బంద్‌లో ఉత్సాహంగా పాల్గొన్నాడు. మరి చంద్రబాబు కూడా ముందుకు రాగలడా? బంద్‌లో టిడిపి శ్రేణులు పాల్గొంటున్నాయని పచ్చ మీడియాలో ప్రచారం చేయించడం కాదు….అంతటి చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు ఎందుకు పాల్గొనడు? మోడీ అంటే భయం తప్ప వేరే కారణం ఉందా? పేద ప్రజలు మరుగుదొడ్లు నిర్మించుకోకపోతే వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేస్తానని బెదిరిస్తున్న చంద్రబాబు ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఒక్క రోజు బంద్‌లో పాల్గొనలేడా? ఇక బాబు భజనసేనుడు పవన్ వ్యవహారం కూడా అలానే ఉంది. మాటల్లో వామపక్ష భావాలు వినిపించే పవన్ కూడా బంద్‌కి మద్దతు అని ఒక మాట అనేసి ఫాం హౌస్‌కి వెళ్ళిపోయాడు. కానీ బంద్‌లో తానూ పాల్గొనాలి గానీ, అభిమానులు కూడా భారీ సంఖ్యలో పాల్గొనేలా చేయాలన్న ఉద్ధేశ్యం కానీ పవన్‌కి అస్సలు ఉన్నట్టు లేదు. హోదా ఉద్యమ సమయంలో కూడా పవన్ వ్యవహారం అంతే. ట్విట్టర్‌లో మద్దతు తెలిపి వైజాగ్ వెళ్ళకుండా డుమ్మా కొట్టాడు పవన్.

చంద్రబాబు, పవన్‌లతో పాటు పచ్చ మీడియా రాజకీయ వ్యూహాలు ఇక్కడ తెలియడం లేదా? కెమేరాలలో చూడాల్సిన ఢిల్లీ హంగామాను పచ్చ మీడియా మేనేజ్ చేయగలదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్ళ ముందు జరుగుతున్న బంద్ విషయంలో ఏం చేయగలదు? బంద్‌కి సంపూర్ణ మద్ధతు తెలిపి, పాదయాత్రకు విరామమిచ్చి….అందరికంటే ముందుగా బంద్‌లో పాల్గొని…..రాష్ట్రవ్యాప్తంగా వైకాపా శ్రేణులన్నీ కూడా భారీగా బంద్‌లో పాల్గొనేలా చేసిన జగన్‌కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టా? జగన్‌కి ఎక్కడ మైలేజ్ వస్తుందో అన్న భయంతో తూతూ మంత్రపు మద్దతు తెలిపే పవన్, చంద్రబాబులకు చిత్తశుద్ధి ఉన్నట్టా? కాస్త పరికించి ఆలోచిస్తే సమైక్యాంధ్ర కోసం నిరాహారా దీక్ష చేసిన జగన్‌కి మైలేజ్ రాకుండా చేయడం కోసం కూడా ఇదే కుట్ర రాజకీయాలు నడిపింది పచ్చ బ్యాచ్. అత్యంత విషాదరకరమైన విషయం ఏంటంటే జగన్‌కి రాజకీయంగా నష్టం చేయాలన్న ప్రయత్నంలో ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిలువునా ముంచేస్తున్నారు బాబు అండ్ కో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -