Tuesday, May 14, 2024
- Advertisement -

హీరోలు విజ‌య్‌,అజిత్‌ల‌పై విశాల్ కామెంట్స్‌

- Advertisement -

త‌మిళ్ హీరో విశాల్ ఉన్న‌ది ఉన్న‌ట్లు మొహం మీదే చెప్పేస్తాడు. విశాల్ స్టార్ హీరోగా ఎదగడం ఒకెత్తయితే.. పెద్ద పెద్ద వాళ్లను ఎదిరించి నడిగర్ సంఘం.. తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో గెలవడం మరో ఎత్తు. వీటిలో కీలక పదవులు చేపట్టిన విశాల్  పరిశ్రమ కోసం గట్టిగానే పాటుపడుతున్నాడు. తమిళ చిత్రపరిశ్రమకి సంబంధించిన కీలకమైన నిర్ణయాలను తీసుకుంటూ వాటిని సాహసోపేతంగా విశాల్ అమలు పరుస్తున్నాడు.ఎంతటి వాళ్ల మీదైనా విశాల్ ధైర్యంగా విమర్శలు చేయగలడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, స్టార్ హీరోలైన విజయ్ .. అజిత్ గురించి ప్రస్తావించాడు.

విజయ్ మంచి నటుడు తమిళ చిత్ర పరిశ్రమలోని ఒడిదుడుకులను తట్టుకుని నిలబడిన హీరో. ఆయన డాన్స్ చాలా అద్భుతంగా చేస్తాడు.డాన్స్ లో ఆయనకి సాటిరాగల హీరో కోలీవుడ్ లో లేడు  అన్నారు.ఇక అజిత్ గ‌ట్టి కౌంట‌రే ఇచ్చాడు.అజిత్ లో చాలా మంచి లక్షణాలు ఉన్నాయని అంటూనే.. ఆయనలోని ఒక చెడ్డ లక్షణం గురించి కూడా చెప్పాడు విశాల్. అజిత్ జనాలకు దొరకకుండా చాలా దూరంగా ఉండిపోతారని.. ఏ విషయంలో అయినా ఆయన్ని సంప్రదించడం కష్టమని అన్నాడు. నడిగర్ సంఘం కార్యదర్శిగా.. నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ కొన్ని కార్యక్రమాల కోసం అజిత్ ను సంప్రదించాలని చూస్తే అతను దొరకలేదట. ఈ నేపథ్యంలోనే విశాల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. మ‌రి హీరో విజ‌య్‌ని పొగిడి అజిత్‌ని కించ‌ప‌రిస్తే ఆయ‌న అభిమానులు ఊరుకుంటారా అనేది చూడ‌లి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -