Wednesday, May 1, 2024
- Advertisement -

`హ‌లో` సినిమా టీజ‌ర్ విడుద‌ల‌

- Advertisement -

సినీ ప‌రిశ్ర‌మ‌కు క‌థ‌నాయికుడిగా అరంగేట్రంతో ప‌రాజ‌యం పొందిన అక్కినేని నాగార్జున త‌న‌యుడు అఖిల్ ఆ త‌ర్వాత సినిమాకు గ్యాప్ ఇచ్చాడు. ఆ స‌మ‌యంలో కుటుంబంలో శుభ‌కార్యాలు త‌దిత‌ర కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉండ‌డంతో సినిమాపై అంత‌గా దృష్టి సారించ‌లేదు. ఇప్పుడు అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌వడంతో సినిమాపై ఫోక‌స్ పెట్టాడు. త‌న తండ్రి నాగార్జున స‌మ‌ర్ప‌ణ‌లో న‌టిస్తున్న సినిమా హ‌లో. ఈ చిత్ర టీజ‌ర్ ఇటీవ‌ల విడుద‌ల అయ్యింది. డైలాగ్‌లు ఏమీ లేవు. ఒక్క హ‌లో త‌ప్ప‌. టీజ‌ర్‌లో అఖిక‌ల్‌ చాలా కొత్తగా అందంగా క‌నిపించాడు. నాగార్జున బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ ఓవర్ ఇచ్చారు. ‘ద లక్కీయెస్ట్‌ పీపుల్‌ బోర్న్‌ ఆన్‌ ఇన్‌ దిస్‌ ఎర్త్‌. వాళ్లు మాత్రం ఎవరేం చేసినా, ఏం అడ్డు వచ్చినా, తన సోల్‌ మేట్‌ని కలుస్తారు. లైఫ్‌ని షేర్‌ చేసుకుంటారు.’ అంటూ నాగార్జున చెప్పడంతో టీజ‌ర్ ప్రారంభ‌మ‌వుతుంది. అఖిల్ యాక్ష‌న్ ఎక్కువగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.

ప్రముఖ ద‌ర్శ‌కుడు ప్రియదర్శన్ కుమార్తె కల్యాణి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇక అఖిల్ చిన్న‌త‌నంలో క్యారెక్ట‌ర్‌గా సుప్రీమ్‌ చిత్రంలో న‌టించిన బాలుడు న‌టిస్తున్నాడు. నా రాజ్యంలో ప్ర‌జ‌లు క‌ష్టాలు పడితే నేను చూడ‌లేను అని ముద్దుముద్దు మాట‌ల‌తో అల‌రించిన ఆ బాలుడు ఈ సినిమాలో ఆక‌ట్టుకుంటున్నాడు. మనం దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఈ చిత్రం తీస్తున్నాడు. డిసెంబర్ 22వ తేదీన విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో జ‌గ‌ప‌తి బాబు, ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -