Saturday, May 11, 2024
- Advertisement -

పాద‌యాత్ర‌పై ఎప్ప‌టిక‌ప్పుడు నివేదిక‌లు తెప్పించుకుంటున్న కేంద్రం..

- Advertisement -

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. జాతీయ స్థాయిలో కూడా పెద్ద పార్టీల‌ను ఆక‌ర్శిస్తోంది. ఈనెల 6 వ‌తేదీన ప్రారంభించిన పాద‌యాత్ర కొన‌సాగుతోంది. అయితె పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇప్ప‌టికె ఏపీ ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు సంబంధించిన విష‌యాల‌ను ఎప్ప‌టి క‌ప్పుడు ప్ర‌భుత్వానికి అందిస్తోంది.

ఒక వైపు రాష్ట్ర ఇంట‌లిజెన్సీ మ‌రో వైపు పీఎంవో కూడా నిఘాను ఏర్పాటు చేసి ఎప్ప‌టి క‌ప్పుడు పాద‌యాత్ర‌కు సంబంధించి నివేదిక‌ల‌ను తెప్పిచ్చుకుంటోంద‌ట‌.పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు డ్రోన్ కెమెరాలు, బాడీవేర్ కెమెరాలతో జగన్‌ యాత్రపై నిఘా ఉండడంతో పాటు… జగన్ యాత్రకు వస్తున్న ప్రజల నాడిని ఎప్పటికప్పుడు తెలుసుకుని సీఎంవోకు చేరవేస్తున్నారు. జగన్ పాదయాత్రను కేంద్ర ఇంటెలిజెన్స్ ఐబీ నిశితంగా పరిశీలిస్తున్నట్టు ప్ర‌ముఖ ప‌త్రిక‌లో ఆస‌క్తిక‌ర‌మైన కథనాన్ని ప్ర‌చురించింది.

కేంద్ర ఇంట‌లిజెన్సీ ఐబీనే కాకుండా ఇతర ఏజెన్సీల ద్వారా కూడా పీఎంవో సమాచారం తెచ్చుకుంది. దీనిపై బీజేపీ మీడియా ఇన్‌చార్జ్‌ సంజయ్ మాయక్ స్పందిస్తూ.. జగన్ పాదయాత్రపై తమకు సమాచారం ఉందని వ్యాఖ్యానించారు. మ‌రో వైపు కాంగ్రెస్ మీడియా ఇన్‌చార్జ్ రణ్‌దీప్ సింగ్‌ కూడా జగన్ ప్రజాసంకల్ప యాత్రపై తమకు ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం ఉందని వ్యాఖ్యానించారు. అయితే యాత్రకు భారీగా జనం ఎందుకు వస్తున్నారన్న దానిపై వారిద్దరు స్పందించేందుకు నిరాకరించారు. జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌కు వ‌స్తున్న ఆద‌ర‌న‌ను చూసి 2019 ఎన్నిక‌ల్లో రాజ‌కీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -