Friday, May 3, 2024
- Advertisement -

తుఫాన్ నేఫద్యంలో వ‌ల‌స పక్షులు మృత్యువాత..

- Advertisement -

టెక్కలి మండలం తేలినీలాపురం గ్రామంలో విదేశాలనుంచి పక్షులు విడిది కోసం ఆస్ర్టేలియా నుంచి వస్తుంటాయి. వాటికి రక్షణ చేయవలసిన అటవీశాఖ అదికారుల నిర్లక్ష్యముతో పక్షులు మృత్యవాత పడుచున్నాయి. ఈ రోజు బంగాళఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా కురుస్తున్న వర్షాలకు చెట్లు విరిగిపోవటంతో చెట్లుపై వున్న పక్షులు క్రింద పడిపోవటంతో కొన్ని పక్షులు చనిపోయాయి.

గుడ్లు పెట్టే పక్షులు ,చిన్న చిన్న పక్షలు చనిపోవటంతో గ్రామస్తులతో పాటు పర్యటనకు వచ్చేవారు సైతం అటవీ అదికారులపై విరుచుకుపడుచున్నారు. ప్రభుత్వం తుఫాన్ అంచనాలు ముందస్తుగా తెలియజేస్తున్న అదికారులు మాత్రం చర్యలు చేపట్టటంలేదని పలువురు ప్రజలు అదికారులపై విరుచుకుపడుచున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -