టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు పక్కన హీరోయిన్‌గా చేయలంటే ఎంతో అదృష్టం పెట్టి పుట్టాలి. మహేశ్ బాబుతో సినిమా చేయలని బాలీవుడ్ హీరోయిన్లు సైతం రెడీ అంటారు. ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ మహేశ్ బాబుతో సినిమా చేసే అవకాశం వస్తే అసలు వదులుకోనని తెలిపింది. అలాంటి మహేశ్‌తో తన తొలి సినిమాలోనే హీరోయిన్‌గా నటించింది కృతి సనన్. మహేశ్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 1 నేనొక్కిడినే సినిమాలో హీరోయిన్‌గా పరియియం అయింది కృతి సనన్.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచినప్పటికి ఆమెకు బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. దీంతో అక్కడ ఆమె క్రీజీ హీరోయిన్‌గా మారింది. తాజాగా ఈ భామ ఓ ఐటం సాంగ్‌లో కనిపించనుందని సమాచారం. కరణ్ జోహర్ నిర్మాణంలో వరుణ్ ధావన్, ఆదిత్య చోప్రా హీరోలుగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా కలాంక్‌లో కృతి సనన్ స్పెషల్ సాంగ్ లో నటించింది. ఇప్పటికే ఈ పాటకు సంబందించిన షూటింగ్ కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!