టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రిన్స్ మహేష్ బాబు సరసన ‘1 నేనొక్కడినే’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. అక్కినేని హీరో నాగచైతన్యతో జత కట్టినప్పటికి ఈమెకు తెలుగులో పెద్దగా ఆదరణ దక్కలేదు. దీంతో బాలీవుడ్ వైపు తన దృష్టిసారించిన కృతిసనన్ ప్రస్తుతం ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ప్రభాస్, కృతి సనన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న తాజా సినిమా ‘ఆది పురుష్’. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియన్ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ప్రభాస్ శ్రీ రాముడిగా నటిస్తుండగా, సైఫ్ రావణుడిగా కనిపించనున్నాడు. కృతి సనన్ సీతగా కనిపిస్తోంది. సన్నీ సింగ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.
అయితే గత కొంత కాలంగా కృతి సనన్, ప్రభాస్ గురించి బోలెడన్నీ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే నిశ్చితార్థం జరగబోతోందని వార్తలు వచ్చాయి. మొన్నటికిమొన్న మాల్దీవుల్లో వీరి ఎంగేజ్‌మెంట్ జరుగుతుందని ప్రచారం జరిగింది. తాజాగా కృతి సనన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమేనని స్పష్టం చేసింది. అంతేకాదు ‘ఆది పురుష్’ టీజర్ రిలీజ్ తర్వాత వచ్చిన నెగెటివ్ రియాక్షన్స్ పై స్పందిస్తు ఆ ట్రోలింగ్ తనను చాలా బాధించినట్లు చెప్పింది. ఈ స్థాయిలో ప్రతికూల స్పందన వస్తుందని ఊహించలేదన్నది.
Also Read: సై అంటున్న రామ్ చరణ్, అల్లు అర్జున్ ?
