బాహుబలిలో శివలింగాన్ని ఎత్తుకున్న శివుడు ఇప్పుడు నందులను ఎత్తుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన 2015 నంది అవార్డుల్లో బాహుబలి ది బిగినింగ్ సాహో అనిపించింది. మొత్తం 11 అవార్డులు వివిధ విభాగాల్లో పొంది రికార్డు సృష్టించింది. శివుడి పాత్రతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన బాహుబలి అందరీ దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా వసూళ్లపరంగానే కాకుండా అవార్డుల కొల్లగొట్టడంలోనూ ముందుంది. రాజమౌళి తన బృందం దాదాపు రెండు, మూడేళ్ల చేసిన కృషికి ఫలితం లభిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శితమవుతూ భారతదేశ సినీ సత్తాను దేనికి తీసుపోదని ధృవీకరించింది. ఈ సినీ దృశ్యానికి అవార్డులన్నీ మోకరిల్లాయి.
ఉత్తమ దర్శకుడు రాజమౌళి
ఉత్తమ విలన్ రానా
ఉత్తమ సహాయ నటి రమ్యకృష్ణ
ఉత్తమ కాస్ట్యూమ్స్ రమా రాజమౌళి, ప్రశాంతి
ఉత్తమ గాయకుడు కీరవాణి (జటా..జటా)
ఉత్తమ ఫైట్స్ పీటర్ హెయిన్స్
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్ రవిశంకర్ (కట్టప్ప సత్యరాజ్)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ ఎస్.శ్రీనివాస్ మోహన్
ఉత్తమ కళాదర్శకుడు సాబు శిరిల్
ఉత్తమ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్
ఉత్తమ ఆడియో గ్రాఫర్ పీఎం సతీశ్