Friday, March 29, 2024
- Advertisement -

నవీన్​ పొలిశెట్టితో మూవీకి నో చెప్పిన స్వీటీ..!

- Advertisement -

జాతిరత్నాలు ఫేమ్​ నవీన్​ పొలిశెట్టి.. స్వీటీ అనుష్క ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 20 ఏళ్ల కుర్రాడు 40 ఏళ్ల యువతికి మధ్య ప్రేమ చిగురిస్తే ఎలా ఉంటుంది? అన్నదే ఈ చిత్ర కథ అని.. కామెడీ, రొమాంటిక్​ ఎంటర్​ టైయినర్​గా ఈ మూవీ తెరకెక్కబోతుందని వార్తలు వచ్చాయి. రారా కృష్ణయ్య ఫేమ్​ మహేశ్​ దర్శకత్వం వహిస్తున్నాడని.. యూవీ క్రియేషన్స్​ బ్యానర్​ ఈ చిత్రాన్ని నిర్మిస్తోందని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ చిత్రం ఆగిపోయినట్టు సమాచారం.

ఈ సినిమాలో నటించేందుకు స్వీటీ అనుష్క నో చెప్పిందట. దీంతో ఈ మూవీ బ్రేక్ పడిందట. సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క.. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా బరువు తగ్గలేదు. దీంతో స్టార్​ హీరోలతో అవకాశాలు తగ్గిపోయాయి. అప్పటికే బాహుబలికి డేట్స్​ ఇచ్చేయడంతో ఈ మూవీలో అనుష్కది కీలక పాత్ర కావడంతో గ్రాఫిక్స్​తో మేనేజ్​ చేశారు. ఆ తర్వాత భాగమతి వంటి లేడీ ఓరియెంటెడ్​ చిత్రాల్లో నటిస్తోంది అనుష్క. ఇక ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నిశ్శబ్ధం చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమాలో అనుష్క మూగ చెవిటి పాత్రలో నటించింది. ఆమె నటనకు మంచి మార్కులే వచ్చినా సినిమా హిట్​ కాలేదు.

నవీన్​ పొలిశెట్టి సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. జాతి రత్నాలు హిట్​ కొట్టడంతో అతడి క్రేజ్​ అమాంతం పెరిగిపోయింది. దీంతో అనుష్కతో చేసే చాన్స్​ వచ్చింది. అయితే ఈ సినిమా కోసం బరువు తగ్గాలని డైరెక్టర్​ అనుష్కకు సూచించాడట. కానీ ఎంత ట్రై చేసినా అనుష్క బరువు తగ్గడం లేదని టాక్​.

మరోవైపు సినిమా చేసేందుకు కూడా అనుష్కకు పెద్దగా ఇంట్రెస్ట్​ లేదట. దీంతో ఆమె ఈ ప్రాజెక్ట్​ నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పిందట. అయితే అనుష్క ప్లేస్​లో మరోనటిని పెట్టి.. సినిమాను లాగించేస్తారా? లేక ఆపేస్తారా? అన్న విషయంపై క్లారిటీ లేదు. ఇదే విషయంపై పలువురు నెటిజన్లు నవీన్​ పొలిశెట్టిని సోషల్ మీడియాలో ప్రశ్నించారు. దీనికి ఆయన తాను ఈ విషయంపై త్వరలోనే చెబుతునంటూ పేర్కొన్నాడు. మొత్తానికి ఈ చిత్రానికి బ్రేకులు పడ్డట్టున్నాయి.

Also Read

రాధేశ్యామ్​ రికార్డు.. ఏ ఇండియన్​ సినిమాకు దక్కని ఘనత

ఈ వారం ఓటీటీ చిత్రాలు ఇవే..!

దాదా బయోపిక్​కు లైన్​ క్లియర్​.. హీరో ఎవరంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -