Tuesday, May 14, 2024
- Advertisement -

బట్టతల గురించి షాకింగ్ నిజాలు చెప్పిన హీరో నాగార్జున!

- Advertisement -
tips to avoid nagarjuna bald head shocks you

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ఏళ్లు వచ్చిన ఇంకా యంగ్ హీరోలానే కనిపిస్తారు. అలాంటి నాగార్జునను బట్టతల విపరీతంగా భయపెట్టేసిందట. ఇప్పటివరకు ఏ చిత్రంలో విగ్గు పెట్టాల్సిన పరిస్థితి రాణి నాగార్జునకు బట్టతలా రాకపోయినా చెమటలు పట్టించేసిందట. దానికి కారణం గురించి నాగార్జున ఇటివలే ఓ ఇంటర్వ్యులో చెప్పుకొచ్చాడు. నాకు 28, 29 ఏళ్ల వయసున్నప్పుడు జుట్టు బాగా పలచబడిపోయింది. వెంట్రుకలు బాగా రాలిపోయేవి. నాన్న, అన్నయ్యలాగే నాకూ బట్టతల వచ్చేస్తుందని చాలా భయపడ్డాను.

ఇప్పటిలా అప్పుడేమో హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ట్రీట్ మెంట్లేమో లేవాయే. కేరళలో ఓ ఆయుర్వేద తైలం దొరుకుతుందని, ఆ నూనె పెట్టుకుంటే జుట్టు రాలడం తగ్గిపోయి ఒత్తుగా తయారవుతుందని ఓ మలయాళ ఆర్టిస్టు చెప్పాడు. దాని ధర రూ.80. వెంటనే నా పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ శేఖర్‍ను అక్కడకి పంపించాను. అయితే అక్కడ మాత్రం ఒక్కరికి ఒక్క బాటిల్ నూనె మాత్రమే ఇస్తారు.

అది కూడా లైన్ లో నిలబడి తెచ్చుకోవాలి. బ్లాక్‍లో తీసుకొవాలంటే.. రూ.500 పెట్టాల్సిందే. మొత్తానికి శేఖర్ ఆరు నెలలకు సరిపడా బాటిళ్లు తీసుకొచ్చాడు. ఆ నూనె వాడాన తర్వాత జుట్టు కాస్తంత ఒత్తుగా మారింది. కానీ చేత్తో పెట్టుకుంటే మాత్రం.. చేతికి నల్లగా రంగు అంటుతుంది. ఆ రంగు రెండు మూడు రోజులైన పోదు. అందుకే చేతికి గ్లోవ్స్ వేసుకుని పెట్టుకునేవాడిని. ఆ నూనె పెట్టుకుంటూనే కథలు వినేవాణ్ని. పక్కన ఉన్న వాళ్ళు నవ్వినా.. నా పని నేను చేసుకునే వాడిని. ఇక, ఆ నూనె రంగులానే అప్పుడు పెరిగిన జుట్టు ఇప్పటికీ ఊడలేదు. ప్రస్తుతం ఆ నూనె కూడా దొరకడంలేదు.. అంటూ.. తనను భయపెట్టిన బట్టతల గురించి చెప్పాడు నాగార్జున.

Related

  1. పెళ్లిళ్ల విషయంలో షాకింగ్ ట్విస్టులు ఇస్తున్న నాగార్జున
  2. జబర్ధస్త్ షోకి నాగబాబు, రోజా రెమ్యునరేషన్ తెలుసా..?
  3. వర్మ.. నాగబాబు.. గొడవపై చిరు.. ఏమన్నారంటే..?
  4. నాగబాబు దగ్గర అసలు డబ్బులు లేవా.. అందుకే ఆ పని చేయడం లేదా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -