Monday, April 29, 2024
- Advertisement -

సూర్య ఓవర్ సీస్ లో దున్నేస్తున్నాడు

- Advertisement -

సూర్య హీరోగా నటించిన ప్రయోగాత్మక సినిమా ’24’ భారీ అంచనాల మధ్యన గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సూర్యకు తెలుగులో ఉన్న ఇమేజ్‌తో పాటు ’13బీ’, ‘ఇష్క్’, ‘మనం’ సినిమాలతో ఓ కొత్త ట్రెండ్ సృష్టించిన దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించిన సినిమా కావడం కూడా ’24’కు భారీ అంచనాలు తెచ్చిపెట్టాయి.

ఇక ఆ అంచనాలను మించి సినిమా ఉండడంతో అటు తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు కాసుల వర్షం కురిపిస్తున్నారు. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో కలుపుకొని వీకెండ్ ముగిసేసరికల్లా 1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. తమిళ సినీ పరిశ్రమకు సంబంధించి 1 మిలియన్ మార్క్‌ను పెద్ద విశేషంగానే చెప్పుకోవచ్చు.

సినిమాకు మొదటి రోజునుంచే సూపర్ పాజిటివ్ టాక్ రావడంతో రోజురోజుకీ కలెక్షన్స్ మరింత పెరుగుతూ వీక్‌డేస్‌లోనూ సినిమా స్ట్రాంగ్‌గా నిలబడింది. ఇప్పటివరకూ యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 1.18 మిలియన్ డాలర్లు (సుమారు 7.89కోట్లు) వసూలు చేసింది. టైమ్ ట్రావెల్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను 75 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో సూర్య స్వయంగా నిర్మించారు. సూర్య సరసన సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సుమారు 2000లకు పైగా థియేటర్లలో విడుదల అయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -