Sunday, May 5, 2024
- Advertisement -

నాకు అవన్నీ చిరాకు, నేను ముఖ్యమంత్రిని కావాలనుకోవడం లేదు – కేటీఆర్

- Advertisement -

కెసిఆర్ తరవాత అంతటి పేరు ని తెలంగాణా లో ప్రస్తుతం మోస్తున్న లీడర్ కేటీఆర్ . మంత్రిగా జనం గుండెల్లో నాయకుడిగా కార్యకర్తల గుండెల్లో మంచి మార్కులు కొట్టేస్తున్న కేటీఆర్ త్వరలో అంటే 2019 లో ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ పక్కగా ఉంది అని ఎంత చిన్న రాజకీయ విశ్లేషకుడిని అడిగినా చెప్పేస్తాడు. అయితే కేటీఆర్ మాత్రం ఈ విషయం లో నెగెటివ్ గా మాట్లాడుతూ ఉండడం గమనార్హం.

ఈ మధ్యన రాజకీయ వారసత్వాల గురించి ఒక టీవీ ఛానల్ కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యకరం గా అనిపించాయి. వారసత్వ రాజకీయాలంటే తనకు చిరాకని చెప్పుకొచ్చారు. ఇక.. తనకు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ లేదని.. తన తండ్రి కమ్ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని తాను అనుకుంటున్నట్లుగా వెల్లడించారు.

టీఆర్ఎస్ బలపడే క్రమంలో పార్టీలోకి తాజాగా పలువురు నేతల్ని పార్టీలోకి చేర్చుకుంటున్న వైనాన్ని కేటీఆర్ ను ప్రశ్నించినప్పుడు.. పార్టీలోకి వచ్చి చేరుతున్న నేతల తీరు కొందరి నచ్చొచ్చని.. కొందరికి నచ్చకపోవచ్చని.. అదంతా వారి ఆలోచనను అనుసరించి ఉంటుందన్న మాటను చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -