Sunday, May 5, 2024
- Advertisement -

24 సినిమా చూసి ఫిదా ఐన కేటీఆర్

- Advertisement -

తమిళ సూపర్ స్టార్ సూర్య 24 తో మళ్ళీ తెలుగు, తమిళ సినిమాల్లో పునరాగమనం చేసాడు. ఊహించని బ్లాక్ బస్టర్ తో సూపర్ హిట్ కొట్టేసి కలక్షన్ ల వర్షం కురిపిస్తూ ఉన్నాడు. సైన్స్ ఫిక్షన్ కథాంశం తో సాగే ఈ సినిమా యూత్ నే కాక ఫామిలీ ని కూడా ఆకట్టుకుంటూ ఉండడం విశేషం. ఇలాంటి కొత్త తరహా కథాంశాలు జనం ఎప్పుడూ అంగీకరిస్తారు అని ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ అయ్యింది.

అయితే తెలంగాణా మంత్రి , ముఖ్యమంత్రి కొడుకు అయిన కేటీఆర్ ఈ సినిమా గురించి తన ట్విట్టర్ లో ప్రస్తావించడం విశేషం. సినిమా చూశాక ఆయన తన ట్విట్టర్ ఎకౌంట్‌ ద్వారా సూర్యపై ప్రశంసలు కురిపించారు. అద్భుతమైన స్క్రీన్‌ప్లే, నటనతో సినిమాకు ఓ మంచి అందం తెచ్చారని, తనకు సినిమా చాలా బాగా నచ్చిందని కేటీఆర్ తెలిపారు.

తన పిల్లలిద్దరూ టైం ట్రావెల్ వాచీ కావాలని అడుగుతున్నారని కేటీఆర్ సరదాగా వ్యాఖ్యానించడం విశేషంగా చెప్పుకోవాలి. ఇక తెలుగులో దర్శకుడిగా తనదైన బ్రాండ్ సృష్టించిన విక్రం కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -