Monday, May 20, 2024
- Advertisement -

24 ఏళ్ల అనుబంధం వారిద్దరిది

- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్, గానగంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం. వీరిద్దరి కాంబినేషన్ గడచిన 24 ఏళ్లుగా ఉంది. రజనీకాంత్ కన్నడంలో నటించిన బాలు జెన్ చిత్రానికి పాట పాడిన బాలసుబ్రహ్మణ్యం 1993 నుంచి ఆయన ప్రతి సినిమాకు పాట పాడారు.

అయితే కొత్త చిత్రం కబాలిలో మాత్రం బాలు పాట లేదు. ఇదేలా తెలిసిందంటరా. కబాలి చిత్రం ఆడియో వేడుకను రద్దు  చేసిన నిర్మాతలు పాటల లిస్టును మాత్రం విడుదల చేశారు. ఇందులో బాలసుబ్రహ్మణ్యం ఒక్క పాట కూడా పాడినట్లుగా లేదు. దీంతో రజనీకాంత్ నటించిన లింగ చిత్రమే బాలు సూపర్ స్టార్ కు పాడిన చివరి పాట అనుకుంటున్నారు.

వీరిద్దరి 24 ఏళ్ల బంధానికి కబాలీ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ బ్రేక్ వేసినట్లు అయ్యింది. మరి ముందు ముందు ఇలాగే జరుగుతుందో లేక రజనీకాంత్ అడిగితే బాలు పాటలు పాడతాడో వేచి చూడాలి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -