Sunday, May 19, 2024
- Advertisement -

ఇంటి వాడవుతున్న దర్శకుడు క్రిష్

- Advertisement -

క్రిష్. టాలీవుడ్ మాంచి టాలెంట్ ఉన్న దర్శకుడు. కంచె సినిమాతో జాతీయ అవార్డు తీసుకున్న క్రిష్ ఇంటివాడవుతున్నాడు. ఇంతకీ క్రిష్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరో తెలుసా. ఓ డాక్టర్. ఇంతకు ముందు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని అనేవారు.

అయితే ఇప్పుడు మాత్రం ఆ రెండు క్రిష్ ఇంట్లోనే ఉండబోతున్నాయి. చిన్న సవరణ ఏమిటంటే యాక్టర్ కాదు డైరక్టర్. క్రిష్ పెళ్లాడబోయే అమ్మాయి పేరు రమ్య. ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమే కావడం విశేషం. ప్రస్తుతం నందమూరి అందగాడు బాలక్రష్ణతో గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం తీస్తున్న క్రిష్ హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ తీయనున్నారు. అది పూర్తి అయిన తర్వాత ఆగస్టు నెలలో క్రిష్ పెళ్లి జరుగుతుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

గౌతమి పుత్ర శాతకర్ణి తొలి షెడ్యూల్ మొరాకోలో తీసారు. ఇటీవలే బాలక్రష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం తొలి పోస్టర్ ను విడుదల చేసారు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -