Sunday, May 5, 2024
- Advertisement -

బాహుబలి ప్రసారహక్కుల కోసం జెమినీ టీవీ అన్ని కోట్లు పెట్టింది!

- Advertisement -

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రాణా, అనుష్క, తమన్నా తదితరులు ముఖ్యపాత్రల్లో వస్తున్న “బాహుబలి” సినిమా శాటిలైట్ టెలికాస్ట్ హక్కులను సన్ నెట్ వర్క్ వాళ్లుసొంతం చేసుకొన్నట్టుగా తెలుస్తోంది.

ఈ నెట్ వర్క్ లోని చానళ్లలో ప్రసారం చేసుకోవడానికి తగిన విధంగా ఈ సినిమా రైట్స్ ను వారు కొనుక్కొన్నారు. రెండు వెర్షన్లలోని విడుదల అయ్యే బాహుబలి సినిమా ప్రసార హక్కుల విషయంలో ఈ టెలివిజన్ నెట్ వర్క్ కోట్ల రూపాయలను పోసిన తీరు అనేక మందిని ఆశ్చర్యపరుస్తోంది!

ఏకంగా 25 కోట్ల రూపాయలను వెచ్చిందట సన్ నెట్ వర్క్. బహుబలి- ది బిగినింగ్, బాహుబలి కొనసాగింపు.. రెండు సినిమాలనూ ఈ నెట్ వర్క్ వారు కొనుక్కొన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాపై అంచనాలు ఏస్థాయిలో ఉన్నాయో వేరే చెప్పనక్కర్లేదు. దాదాపు రెండు సంవత్సరాల నుంచి రూపొందుతున్న ఈ సినిమా ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఆడియో విడుదల వరకూ వచ్చింది కానీ.. అది కూడా పోస్టు పోన్ అని అంటున్నారు.

విడుదల విషయంలో కూడా ఈ సినిమా ముందుగా అనుకొన్న అంచనాలను రీచ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అయినా కూడా అభిమానుల్లో ఈ సినిమా పట్ల ఆసక్తి ఉత్కంఠ ఏ మాత్రం తగ్గలేదు. ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ రేట్లు దాని స్థాయికి నిదర్శనంగా ఉన్నాయి. రెండు వెర్షన్లలో ఉంటుంది కాబట్టి.. ఒక్కో వెర్షన్ కు 12.5 కోట్ల రూపాయలు వెచ్చించినట్టు. అయినా కూడా టాలీవుడ్ వరకూ ఇది రికార్డే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -