Sunday, May 5, 2024
- Advertisement -

కుర్ర హీరోలకు పోటీ: చిరంజీవి స్లిమ్ లుక్!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి 150  సినిమాకు శరవేగంగా ప్రిపేరయిపోతున్నాడు. దాదాపు ఏడు సంవత్సరాల విరామనంతరం మెగాస్టార్ తెరపై కనిపించడానికి తగు విధంగా ప్రిపేరవుతున్నాడు. పొలిటికల్ జర్నీకి కొంత విరామం ఇచ్చి తిరిగి సినిమాలతో బిజీ అయిపోనున్న మెగాస్టార్ అందుకు తగ్గట్టుగా తన శరీరాకృతిని మార్చుకొన్నాడు.

దీని కోసం లండన్ వరకూ వెళ్లి వచ్చిన చిరంజీవి న్యూ లుక్ అభిమానులను ఆకట్టుకొంటోంది!

కుర్ర హీరోలకు పోటీగా మారినట్టుగా కనిపించాడు చిరంజీవి. ఒక్కసారికి ఒక ముప్పై సంవత్సరాల వయసు తగ్గినట్టుగా.. కుర్రాడిలా మారిపోయాడు. నిండైన శరీరంలో.. లావుపాటి రూపంలో.. మొన్నటి వరకూ అచ్చంగా పొలిటీషియన్ గా కనిపించిన చిరంజీవి ఇప్పుడు మాత్రం ఆ రూపానికి భిన్నంగా కనిపిస్తున్నాడు.

ఇది మెగాస్టార్ తాజా ఫోటో.. తనకు సన్నిహితులు అయిన కన్నడ సూపర్ స్టార్ అంబరీష్ , ఆయన భార్య సుమలత, వారి కూతురు తో కలిసి చిరంజీవి ఆయన భార్య సురేఖలు ఫోటో దిగారు. ఇటీవల ఈ రెండు ఫ్యామిలీలూ మీట్ అయిన సందర్భంలో తీయించుకొన్న ఫోటో ఇది. ఇందులో చిరంజీ స్మార్ట్ లుక్ అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేలా ఉందనడానికి సందేహించనక్కర్లేదు! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -