Saturday, April 27, 2024
- Advertisement -

లావెక్కిన ఇలియానా

- Advertisement -

త‌న అంద‌చందాల‌తో హాట్‌హాట్‌గా కుర్ర‌కారుకు కైపెక్కించిన ఇలియానా ఇప్పుడు అవ‌కాశాలు లేక ఖాళీగా ఉండిపోయింది. ఇప్పుడు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ను ఆమె ప‌ల‌క‌రించ‌డమే లేదు. పూర్తిగా ముంబాయికి ప‌రిమిత‌మైన‌ట్టు క‌నిపిస్తోంది. ఆమె సినిమాలు రాక దాదాపు మూడేళ్లు అయి ఉంటుంది. అయితే ఆమె కెమెరా కంటికి చిక్కి కూడా చాలా రోజులైంది అనుకుంటున్న స‌మ‌యంలో ఓ ప్ర‌చార కార్యక్ర‌మానికి ఇటీవ‌ల ఇలియానా క‌నిపించింది. అయితే ఆమెను చూస్తే ఈమె ఇలియానా అని అంటే ఎవ‌రూ న‌మ్మ‌లేరు. ఆమె శ‌రీరాకృతి మొత్తం మారిపోయింది. ప‌ర్ఫెక్ట్ బాడీ స్ర్ట‌క్చ‌ర్ అంటే ఇలియానాదే అని చెప్పుకునే అభిమానులు ఆమెను చూసి షాక‌య్యే ప‌రిస్థితి వ‌చ్చింది. బొద్దుగా త‌యారై ఎరుపు రంగు దుస్తులు వేసుకొని గుర్తు ప‌ట్ట‌లేని విధంగా మారిపోయింది. అయితే ఆమెకు పెళ్ల‌యి పోయింద‌ని, ఇక కుటుంబానికే ప‌రిమిత‌మైంద‌ని స‌మాచారం.

అందుకే అందంపై ఎక్కువ దృష్టి పెట్ట‌డం లేద‌ని టాక్‌. ఇలియానా అరుణ భిక్షు దగ్గర నటనలో శిక్షణ పొందిన 2006లో వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో వ‌చ్చిన దేవదాసు చిత్రంతో తెలుగు చిత్ర సీమ‌కు వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు చౌద‌రి, ఇలియానాకు ఇద్ద‌రికీ తొలి సినిమా అయినా భారీ హిట్ట‌య్యింది. ఈ చిత్రంలో ఇద్దరి నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటీనటులు అవార్డులు వ‌చ్చాయి. ఆ తర్వాత ప్రిన్స్ మ‌హేశ్‌బాబు స‌ర‌స‌న పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వ‌చ్చిన పోకిరి సినిమాతో ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఒక పోలీస్ అధికారి వేధించబడే శృతి అనే ఎయిరోబిక్స్ టీచర్ పాత్రను పోషించి ఇలియానా ఆక‌ట్టుకుంది.ఆ సినిమా త‌ర్వాత ఆమెకు సినిమా అవ‌కాశాలు వెల్లువ‌లా వ‌చ్చాయి. టాప్ వ‌న్ హీరోయిన్‌గా ఎదిగిన ఆమెకు త‌ర్వాత అవ‌కాశాలే లేకుండా పోయాయి. అవకాశాలు రావట్లేదు అని ఏడ్చేకంటే వచ్చిన అవకాశాలు ఎలా యూజ్ చేసుకోవాలో తెలిసుండాలి. ఈ విషయంలో ఇలియానా పీహెచ్‌డీ కాదు అని ఇలియానా అమ్మమ్మ వెన‌కేసుకు వ‌చ్చింది. అమ్మడుకు బాలీవుడ్‌లో వెళ్లినా క‌లిసి రాలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -