Saturday, May 11, 2024
- Advertisement -

మంత్రి ఆదిని ఓడించేందుకు జ‌గ‌న్ మాస్ట‌ర్ ప్లాన్‌…

- Advertisement -

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైఎస్సార్ క‌డ‌ప జిల్లాలో ఎక్కువ సీట్లు సాధించి వైఎస్ జ‌గ‌న్‌కు చెక్ ప‌ట్టాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప్ర‌ణాళిక‌లు వేస్తున్నారు. దీనిలో భాగంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల‌ను పార్టీలోకి లాక్కొని మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టిన సంగ‌తి తెలిసిందే. ఫిరాయింపు మంత్రుల‌లో ఎక్కువ‌గా జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేసేది జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ రెడ్డి. ఆయ‌న‌ను ఓడించేందుకు వైసీపీ గ‌ట్టి వ్యూహాన్ని ర‌చిస్తోంది.

పాద‌యాత్ర జ‌మ్ముల‌మ‌డుగులోకి ప్ర‌వేశించిన త‌ర్వాత జ‌గ‌న్ అక్క‌డే బ‌స‌చేశారు. అప్పుడే మంత్రి ఆది నారాయ‌ణ‌రెడ్డిని ఓడించేందుకు జ‌గ‌న్ ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేయాల‌ని నేత‌ల‌కు సూచించారు. నియోజ‌కవ‌ర్గంలో జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. మంత్రి ఆది అనుచ‌రులు జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు వెళ్ల‌కుండా ప్ర‌జ‌ల‌ను అడ్డుకునేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. రెండు రోజుల‌పాటు జ‌గ‌న్ అక్క‌డే పాద‌యాత్ర చేశారు. పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి ఊహించని మ‌ద్ద‌తు వ‌చ్చింది.

పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌ల‌ను రాకుండా మంత్రి చేసిన ప్ర‌య‌త్నాల‌ను జ‌గ‌న్‌కు వివ‌రించారంట‌. దాంతో పాద‌యాత్ర ముగిసిన త‌ర్వాత విశ్రాంతి స‌మ‌యంలో కొంద‌రి కీల‌క నేత‌ల‌ను పిలిపించుకొని చ‌ర్చించారంట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఫిరాయింపు మంత్రి ఆదిని ఎట్టి ప‌రిస్థితుల్లోను గెలవ‌నీయ‌కూడ‌ద‌ని జ‌గ‌న్ స్ప‌ష్టంగా చెప్పారంట‌.

ఫిరాయింపు మంత్రిని కట్టడి చేసేందుకు అవసరమై వ్యూహాలు, అమలు బాధ్యతలు తీసుకునే విషయంలో పక్కాగా స్కెచ్ వేయమని ఆదేశించారట. జగన్ తో భేటీ అయిన నేతల్లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, జమ్మలమడుగు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి సుధీర్ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ‌రెడ్డి, సీనియ‌ర్ నాయ‌కుడు వైఎస్ వివేకానందరెడ్డి తదితరులు ఉన్నట్లు సమాచారం. ప్ర‌ధానంగా ఆదిని వ్య‌తిరేకిస్తున్న అంద‌రిని ఒక తాటిమీద‌కు తీసుకు రావ‌డం ప్ర‌ధానం. ప‌దే ప‌దే జ‌గ‌న్‌ను విమ‌ర్శిస్తూ ఎప్పుడు వ‌చ్చినా 60 వేల మెజారిటీ వ‌స్తుంద‌ని స‌వాల్ విసురుతున్నారు. మంత్రికి చెక్ పెట్టేందుకు జ‌గ‌న్ ప‌న్నిస్తున్న‌ వ్యూహం ఫ‌లిస్తుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -