Sunday, May 12, 2024
- Advertisement -

వామ్మో ఆకాశంలో 30 కోట్లు ఎగరేసిన ప్రభాస్‌!

- Advertisement -
30 Crs Budjet For Single Sky Fight In Prabhas Sujeeth Movie

బాహుబలి కోట్లు కొల్లాగొట్టిందని ముప్పయ్‌ కోట్లు ఆకాశంలో ఎగరేస్తున్నాడా అనేసుకోకండి.. ఈ ముప్పయ్‌ కోట్ల వెనుక అసలు విషయం వేరే ఉంది. ప్రభాస్ బాహుబలి తర్వాత సుజీత్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ యాక్షన్‌ ఫైట్‌ ఉంటుందట. మొత్తం ఆకాశంలోనే జరిగే ఈ స్టంట్‌కి దాదాపు ముప్పయ్‌ కోట్లు అవుతుందని అంచనా వేసారట. దీని కోసం హాలీవుడ్‌ చిత్రాలకి పని చేసిన స్టంట్‌ మాస్టర్‌ని హైర్‌ చేసుకున్నారట.

మొదట్లో యాభై కోట్ల పెట్టుబడిలో చేద్దామని అనుకున్న ఈ సినిమాని ఇప్పుడు నూట యాభై కోట్లతో తీయడానికి యువి క్రియేషన్స్‌ సిద్ధపడుతోంది. బాహుబలితో ప్రభాస్‌ ఎలాగో నేషనల్‌ స్టార్‌ అయిపోయాడు కాబట్టి దీనిని హిందీలో, తమిళంలో, మలయాళంలో విడుదల చేసుకోవడానికి ఆస్కారముంది.

అలాంటప్పుడు ఖర్చుకి వెనకాడడం దేనికని అంత ఖర్చు పెట్టడానికి నిర్మాతలు సరేనన్నారు. దాంతో ఆకాశంలో ఫైట్‌ తీయాలనే సుజీత్‌ కల ఈ చిత్రంతో తీరిపోనుంది. ముప్పయ్‌ కోట్లు ఒకే ఒక్క ఫైట్‌ సీన్‌ మీద పెట్టబోతున్నారంటే ఇక అది తెర మీద ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయ్‌ కదూ?

Related

  1. ప్రభాస్ పెళ్లి ఎప్పుడో తెలుసా?
  2. అమ్మాయిలను బాధపెడుతున్న ప్రభాస్!
  3. జక్కన్న కి షాక్ ఇచ్చిన ప్రభాస్!
  4. అనుష్కకి సేవలు చేస్తున్న ప్రభాస్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -