Thursday, May 23, 2024
- Advertisement -

అమ్మాయిలను బాధపెడుతున్న ప్రభాస్!

- Advertisement -

టాలీవుడ్ లో యంగ్ రెబల్ స్టార్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పకర్లేదు. బాహుబలి సినిమాతో ఆ క్రేజ్ మరింత పెరిగింది. అన్ని భాషల్లో బాహుబలి సినిమా విడుదలవ్వడంతో ప్రభాస్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం బాహుబలి 2 చేస్తున్న ప్రభాస్ ఈ సినిమా తర్వాత సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.

అయితే టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఎవరు అంటే వెంటనే చెప్పే పేరు ప్రభాస్. కొంత కాలంగా ప్రభాస్ పెళ్లి పై రకరకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు చెప్పారు. బాహుబలి షూటింగ్ అయిపోయాక ప్రభాస్ పెళ్లి ఉంటుందని అమ్మాయిల వేటలో ఉన్నామని చెప్పిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం బాహుబలి షూటింగ్ దాదాపుగా అయిపోవచ్చింది కొన్ని ప్యాచ్ వర్క్ లు మాత్రమే ఉన్నాయి వచ్చే నెల తో దాదాపుగా షూటింగ్ పార్ట్ అయిపోతుంది కాబట్టి మార్చిలో ప్రభాస్ పెళ్లి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విశాఖ పట్టణం , భీమవరం లలో అమ్మాయిలను చూసారట కూడా, ఇక వాళ్ళలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసి 2017 మార్చిలో పెళ్లి చేయాలనీ నిర్ణయించారు కృష్ణంరాజు. ప్రభాస్ కి పెళ్ళంటే కలల్లో ఊహించుకునే అమ్మాయిలకు మోసం జరిగినట్లే కదా..!

Related

  1. జక్కన్న కి షాక్ ఇచ్చిన ప్రభాస్!
  2. అనుష్కకి సేవలు చేస్తున్న ప్రభాస్!
  3. రామ్ చరణ్ తో ప్రభాస్!
  4. ప్రభాస్ కోసం మిస్ ఇండియా ని దించుతున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -